వైరల్ వీడియో; చిరుతకు చుక్కలు చూపించిన బల్లి…!

-

చిరుతపులి మరియు మానిటర్ బల్లి మధ్య పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయింది. 29 సెకన్ల క్లిప్‌ను ట్విట్టర్‌లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ షేర్ చేశారు. గంటలోనే ఈ వీడియోని దాదాపు 50 వేల మంది వీక్షించారు. ఇక రీట్వీట్లు కూడా ఈ వీడియోకు భారీగానే వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం ఆయన ఈ వీడియోని తన ట్విట్టర్ లో పస్ట్ చేసారు.

ఆకలితో ఉన్న చిరుతపులి ఒక మానిటర్ బల్లిని చూస్తుంది. చిరుతపులి దాన్ని పట్టుకోవడానికి రాగా తన పొడవైన తోకతో పలుసార్లు చిరుత పులి ముఖం మీద కొడుతుంది. ముందు వెనక్కు తగ్గిన చిరుత పులి ఆ తర్వాత అధుని చూసి దాని మెడను పట్టుకుంటుంది. దీనితో ఆ బల్లికి ఇక తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. బల్లిని తీసుకుని పులి గడ్డి మైదానాల్లోకి వెళ్లిపోయింది.

లియోపార్డ్ vs మానిటర్ లిజార్డ్. ఈ బల్లి ఒక ఫైటర్ కానీ చిరుత అద్భుతమైన వేటగాడు అంటూ ఆయన ఈ వీడియో ని పోస్ట్ చేసారు. “సామెత చెప్పినట్లుగా సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్. ఒక గొప్ప వీడియో,” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. పోరాడే వాడు ఎంత బలవంతుడు అయినా ఎదురుపడింది అత్యంత బలవంతుడు అయినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news