బీచ్‌ వద్ద నడుస్తుంటే తిమింగలం వాంతి లభ్యమైంది.. దాని విలువ 2.50 లక్షల డాలర్లు..

-

థాయ్‌లాండ్‌లో ఓ 49 ఏళ్ల మహిళకు దాదాపుగా 1.90 లక్షల పౌండ్ల విలువ గల తిమింగలం వాంతి చేసుకున్న పదార్థం కనిపించింది. ఫిబ్రవరి 23వ తేదీన నఖోన్‌ సి తమ్మరత్‌ ప్రావిన్స్‌లో ఉన్న తన బీచ్‌ హౌస్‌ వద్ద సిరిపొర్న్‌ నియామ్‌రిన్‌ అనే మహిళ వాకింగ్‌ చేస్తుండగా భారీ వ్యర్థ పదార్థం ఒడ్డుకు కొట్టుకువచ్చి కనిపించింది. అయితే దాన్ని పరిశీలించిన ఆమె ముందుగా దాన్ని చేపల వ్యర్థాలేమోనని అనుకుంది. ఆ పదార్థం చేపల వాసన వచ్చింది. దాంతో ఆమె అలా అనుకుంది.

woman found whale vomit at beach it costs 250000 dollars

అయితే అది ఎంతో కొంత విలువ చేస్తుందేమోనని భావించిన ఆమె దాన్ని తన ఇంటికి తెచ్చింది. ఈ క్రమంలోనే ఆమె తన ఇరుగు పొరుగు వారితో మాట్లాడగా అది చేపల వ్యర్థం కాదని, తిమింగలం వాంతి అని, దాన్ని ambergris అని పిలుస్తారని, ఆ పదార్థాన్ని పెర్‌ఫ్యూమ్‌ల తయారీలో వాడుతారని, దాని విలువ పెద్ద మొత్తంలో ఉంటుందని వెల్లడైంది. ఇక అది తిమింగలం వాంతి అవునా, కాదా అని తేల్చుకునేందుకు ఇరుగు పొరుగు వారు ఓ పరీక్ష కూడా చేశారు. దాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని మంట మండించారు. దీంతో అది మండింది. చివరకు దాన్ని తిమింగలం వాంతి అని నిర్దారించారు.

ఆ వాంతి పదార్థం బరువు సుమారుగా 7 కిలోల వరకు ఉంది. దాని విలువ దాదాపుగా 1,86,500 పౌండ్లుగా ఉంటుందని తేల్చారు. అయితే దాన్ని విక్రయించడం కోసం ఆమె నిపుణులను సంప్రదించగా.. దాన్ని విక్రయించడం ద్వారా వచ్చే మొత్తాన్ని కాలనీలో పనులు చేపట్టేందుకు ఉపయోగిస్తానని తెలిపింది. సాధారణంగా తిమింగలాలు వాంతి చేసుకున్నప్పుడు ఆ పదార్థం మొత్తం సముద్రాల ఒడ్డుకు కొట్టుకువస్తుంది. అది ఆరంభంలో దుర్వాసన వస్తుంది. కానీ ఎండిపోయే కొద్దీ సువాసన వస్తుంది. అందువల్లే దాన్ని పెర్‌ఫ్యూమ్‌ల తయారీలో ఉపయోగిస్తారు. గతేడాది డిసెంబర్‌లనూ అదే ప్రాంతంలో ఓ మత్స్యకారుడికి సుమారుగా 100 కిలోల తిమింగలం వాంతి లభ్యమైంది. ఇప్పుడు అక్కడే మళ్లీ ఇలా జరగడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news