3 వారాల తేడాతో కవలలకు జన్మనిచ్చిన మహిళ.. అత్యంత అరుదైన సంఘటన..!

సాధారణంగా మహిళలు గర్భం ధరించాక కవలలకు జన్మనిస్తే ఒకేసారి ప్రసవిస్తారు. కానీ ఇప్పుడు చెప్పబోయేది అత్యంత అరుదైన కేసు. చాలా అరుదుగా మాత్రమే ఇలా జరుగుతుంటుంది. ఒక మహిళ ఒక బిడ్డకు జన్మనిచ్చాక మూడు వారాల అనంతరం ఇంకో బిడ్డకు అదే రోజు జన్మనిచ్చింది. ఇక వారిద్దరూ కవలలు కావడం విశేషం.

woman gave birth to twins with 3 weeks gap

అమెరికాకు చెందిన రెబెక్కా రాబర్ట్స్‌, రైస్‌ వీవర్‌ అనే దంపతులు ఎన్నో ఏళ్ల నుంచి పిల్లల కోసం తాపత్రయపడుతున్నారు. అయితే ఫెర్టిలిటీ మెడిసిన్ వల్ల ఎట్టకేలకు వారి కోరిక తీరింది. రెబెక్కా గత సెప్టెంబర్‌లో ఓ బాలుడికి జన్మనిచ్చింది. అతనికి నోవా అని పేరు పెట్టారు. అయితే అనూహ్యంగా 3 వారాల అనంతరం ఆమె ఇంకో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆడ శిశువును ప్రసవించింది. దీంతో ఆ శిశువుకు రోసిల్‌ అని పేరు పెట్టారు.

అయితే నోవా, రోసిల్‌ ఇద్దరూ మూడు వారాల వ్యవధిలో జన్మించారు. వారిద్దరూ కవలలు కాగా వారిద్దరూ ఒకే రోజున జన్మించారు. వైద్య ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతుంటాయని వైద్య నిపుణులు తెలిపారు. అయితే రెబెక్కా రెండో శిశువును వైద్యులు స్కానింగ్‌లో ముందుగా గుర్తించలేదు. కానీ తరువాత గుర్తించారు. అయినప్పటికీ ఇద్దరు శిశువులను ఆమె ఒకేసారి ప్రసవించలేదు. మూడు వారాల వ్యవధితో ఆమె ఇద్దరికీ జన్మ ఇచ్చింది. దీంతో అది అత్యంత అరుదైన కేసుగా మారింది. ప్రస్తుతం ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని ఆ దంపతులు తెలిపారు.