ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవా లో తెలుసా..!

-

హెల్త్ కు మంచి చేసే వాటిని తీసుకోవడం అంటే అందరికి నచ్చదు. నోటికి రుచిగా ఉండే వాటిని తీసుకోవడం అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లను తినడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు.అయితే బయట దొరికే ఫుడ్ క్వాలిటీ లేకున్న నోటికి రుచిగా ఉంటుంది. అందుకే చిన్నా, పెద్దా అందరూ కూడా ఫ్రైడ్ రైస్ లను తింటారు.ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లోనే తయారు చెసుకోవడం ఎలానో ఇప్పుడు చుద్దాము..

కావాలిసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం : పావు కిలో,

కోడిగుడ్లు :3,

తరిగిన అల్లం వెల్లుల్లి : ఒక టేబుల్ స్పూన్,

తరిగిన క్యాప్సికం :1,

తరిగిన ఉల్లిపాయ : 1,

క్యాబేజ్ తురుము : ఒక కప్పు,

తరిగిన క్యారెట్ :1,

చిన్నగా తరిగిన పచ్చి మిర్చి : 3,

నూనె : నాలుగు టేబుల్ స్పూన్స్,

ఉప్పు : తగినంత,

కారం : అర టేబుల్ స్పూన్,

మిరియాల పొడి : పావు టీ స్పూన్,

గరం మసాలా : అర టేబుల్ స్పూన్,

సోయా సాస్ : ఒక టేబుల్ స్పూన్,

వెనిగర్ : ఒక టేబుల్ స్పూన్..

తయారీ విధానం:

ముందుగా రైస్ ను కడిగి తగినన్ని నీళ్ళు పోసి అన్నం పలుకుగా ఉండేలా చేసుకోవాలి.ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక కోడిగుడ్లను పగలకొట్టి వేసి ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి సిమ్ లో పెట్టి క్యాప్సికం, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాబేజ్ తురుము వేసి వేయించుకోవాలి. ఇవి పూర్తిగా వేగిన తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి..ఆ తర్వాత ఉప్పు, కారం,గరం మసాల, మిరియాల పొడి వేసి బాగా కలిసే లాగా వేసుకోవాలి.పోయా సాస్, వెనిగర్ వేసి 3 నుంచి 4 నిమిషాల పాటు పెద్ద మంటపై నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. 4 నిమిషాల తరువాత స్టవ్ ఆప్ చేసుకోవాలి..అంతే చాలా సింపుల్ గా ఎంతో రుచిగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే రెడీ..చుసారుగా చాలా చక్కగా గుమగుమ లాడుతుంది..కదూ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చెయ్యండి.బాస్మతి రైస్ అందరికి అందుబాటులో ఉండదు..సో అలాంటి వాళ్ళు మామూలు రైస్ కూడా చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news