శుక్రవారం వేపకాయల బతుకమ్మ!

-

ఆదిశక్తికి ఆశ్వీజంలో చేసే పుష్పార్చనే బతుకమ్మ పండుగ. నవరాత్రుల్లో బతుకమ్మను ఆరాధించి అనుగ్రహం పొందుతారు తెలంగాణ ఆడపడుచులు. బతుకమ్మలో ఏడోరోజు ప్రత్యేకత వేపకాయల బతుకమ్మ. వేపచెట్టు సాక్షాత్తు శక్తి స్వరూపంగా ఎల్లమ్మగా తెలంగాణలో ఆరాధిస్తారు. ఆ శక్తి రూపానికి ప్రతీకగా శుక్రవారం ఏడోరోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు.

ఈ రోజు బతుకమ్మను తంగేడు, గునుగు, చామంతి, గులాబి పూలతో ఏడంతారాలు పేర్చి ఆడుకొని చెరువులో వేస్తారు.
ఈ రోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయల్లా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు.
నైవేద్యం: బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి.

Read more RELATED
Recommended to you

Latest news