అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవంలో పాల్గొన్న నలుగురు ప్రపంచ కుభేరులు వీళ్లే

-

ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. అయోధ్యలో బలరాముడి ప్రాణప్రతిష్ట అంగరంగవైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని నలుగురు అత్యంత ధనవంతులు హాజరయ్యారు తెలుసా..? వాళ్లు ఎవరో తెలుసుకుందాం..

జనవరి 22వ తేదీ సోమవారం అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని ప్రారంభించనున్నారు. ఈ గొప్ప చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు భక్తులు అయోధ్యకు పోటెత్తారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా చెప్పినట్లుగా, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దాదాపు వంద చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేశారు.

సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పలువురు క్రీడాకారులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సాధువులు కూడా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే కాకుండా ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్తలు ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా ఉన్నారు. వాళ్ళు ఎంత ధనవంతులంటే, వాళ్ళు తలచుకుంటే పొరుగున ఉన్న పాకిస్తాన్‌ని కొనగలిగేంత సంపద ఉంది. మరి ఈ రామమందిరం కార్యక్రమంలో పాల్గొన్న ధనవంతులు ఎవరంటే..

1. ముఖేష్ అంబానీ:

ప్రపంచంలోనే అత్యంత ప్రముఖుడు, భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు రామమందిర ప్రారంభోత్సవానికి హాజయ్యారు.రామమందిరం కార్యక్రమానికి హాజరయ్యే సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచారు. కొన్ని నివేదికల ప్రకారం, రామమందిర నిర్మాణం కోసం ముఖేష్ అంబానీ భారీ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారని సమాచారం.

2. గౌతమ్ అదానీ:

భారతదేశపు అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ కూడా ఒకరు. గౌతమ్ అదానీ మరియు అతని కుటుంబం శ్రీరాముడి ప్రాణప్రతిస్పన కార్యక్రమంలో పాల్గొంన్నారు. గౌతమ్ అదానీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ యజమాని. గౌతమ్ అదానీ ఒక రోజు ఆదాయం 80 నుండి 100 కోట్ల రూపాయలు.

3. రతన్ టాటా:

రామమందిర ప్రారంభోత్సవాన్ని చూసే సంపన్నులలో రతన్ టాటా కూడా ఒకరు. రతన్ టాటా టాటా గ్రూప్ మాజీ అధిపతి. రామమందిర నిర్మాణానికి రతన్ టాటా దాదాపు 100 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. రతన్ టాటా తన సంపాదనలో సగం సామాజిక కార్యక్రమాలకు విరాళంగా ఇస్తున్నారు. అలా కాకపోతే సంపాదనలో ముఖేష్ అంబానీ కంటే రతన్ టాటా చాలా ముందు ఉండేవారని సమాచారం.

4. అనిల్ అగర్వాల్:

వేదాంత గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ అనిల్ అగర్వాల్ రామమందిరం కార్యక్రమంలో పాల్గొనే నాల్గవ అత్యంత ధనవంతుడు. వేదాంత కంపెనీ మొత్తం విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు. చాలా సాదాసీదాగా కనిపించే అనిల్ అగర్వాల్ మరియు అతని కుటుంబం రామమందిర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news