ఆలూ శాండ్విచ్. ఆలూ అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టం. దీన్ని ఎక్కువగా కర్రీ చేసుకొని తింటుంటారు. ఎంత ఇష్టం అయినా ఎప్పుడూ ఒకే పద్ధతిలో తినాలంటే కాస్త కష్టమే కదా. అందుకే కాస్త వెరైటీగా శాండ్విచ్‌లో కలిపేద్దాం. ఆలూ, శాండ్విచ్ రెండూ కాంబినేషన్ అద్భుతం. ఇలా కనుక చేస్తే పిల్లలు అసలు వదిలి పెట్టరు. మారం చేయకుండా కంప్లీట్‌గా తినేస్తారు. చిటికెలో రెడీ అయ్యే ఆలూ శాండ్విచ్ తయారీ చూద్దాం..
ఆలూ శాండ్విచ్‌కు కావాల్సిన పదార్థాలు :
బ్రెట్ స్లైసెస్ : 2
ఆలూ : 1
పచ్చిమిర్చి : 2
ఉల్లిగడ్డలు : 2
కొత్తిమీర : కొంచెం
జీలకర్ర పౌడర్ : అర టీస్పూన్
కారం : ఒక టేబుల్‌స్పూన్
గరం మసాలా : అర టీస్పూన్
వెజ్ మయోనీస్: 2 టేబుల్‌స్పూన్స్
అముల్ బటర్ : సరిపడా
ఉప్పు : తగినంత
తయారీ :
ముందుగా ఆలూను ఉడికించి తొక్కు తీసి పెట్టుకోవాలి. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలూని స్మాష్ చేసుకోవాలి. అందులో కట్‌చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే జీలకర్ర పౌడర్, కారం, గరం మసాలా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఒకదాని మీద వెజ్ మయోనీస్ రాసుకోవాలి. దాన్ని మీద ఆలూ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని గ్రిల్‌పాన్ వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత ఆలూ బ్రెడ్‌ను మరో బ్రెడ్ స్లైస్‌తో కవర్ చేసుకొని దానిమీద బటర్ రాసుకోవాలి. ఇప్పుడు బటర్ రాసిన సైడ్ పాన్‌కు తాకేలా పాన్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. దీన్ని రెండువైపులా కాల్చుకొని తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక అంతే వేడి వేడి పిల్లలకు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ఆలూ శాండ్విచ్ చాలా బాగా ఉంటుంది.