ఈరోజుల్లో గుండె జబ్బులు వేగంగా పెరగడం మనం చూస్తున్నాం. చిన్నా పెద్ద తేడా లేకుండా, ఎక్కువమంది ప్రమాదానికి గురవుతున్నారు. దీనికి కారణాలు అనేకం జీవనశైలి మార్పులు పెరగటం, ఒత్తిడి, మనం తీసుకునే ఆహారం గుండెపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆరోగ్య నిపుణులు చెప్పినట్లు మన ఆరోగ్యం మనం తినే ఆహారంపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. గుండెను బలంగా ఉంచేందుకు అద్భుతమైన ఆహారాలను ఇప్పుడు చూద్దాం.
గుండెకు మేలు చేసే ఆహారాలు : పండ్లు మరియు కూరగాయలు వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ ఓట్స్, గోధుమలు వంటివి గుండెకు మంచివి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. కొవ్వులేని ప్రోటీన్లు అంటే చేపలు, చికెన్ బీన్స్, వంటివి గుండె ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా సాల్మన్, వంటి చేపలలో ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్స్, ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఫ్రూట్స్, ఆవకాడో, నట్స్, ఆలివ్ ఆయిల్ వంటివి గుండెకు మేలు చేస్తాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.

గుండెకు హాని కలిగించే ఆహారాలు: వీటిలో ముఖ్యంగా ప్రాసెస్ ఫుడ్స్, అంటే ప్యాక్ చేసిన ఆహారాలు ఫాస్ట్ ఫుడ్స్ గుండెకు మంచివి కావు, వీటిలో సోడియం ట్రాన్స్ ఫ్యాట్స్, ఎక్కువగా ఉంటాయి. ఎర్ర మాంసం అధికంగా తీసుకోవడం కొలెస్ట్రాల్ ను పెరగడానికి కారణం అవ్వచ్చు. అధిక చక్కెర ఆహారాలు అంటే సోడాలు, స్వీట్లు, వంటివి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.
మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.