సన్నగా వున్నారా..? లావు అవ్వాలంటే ఇవి పక్కా తీసుకోండి..!

-

weight gain: కొంత మంది బాగా సన్నగా ఉంటారు లావు అవ్వాలని అనుకుంటూ ఉంటారు మీరు కూడా బాగా సన్నగా ఉన్నారా… లావు అవ్వాలని అనుకుంటున్నారా..? చాలా మంది సన్నగా ఉండడం వలన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. బరువు పెరిగేందుకు చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు సులభంగా బరువు పెరగడానికి డైట్ లో వీటిని తీసుకోండి. వీటిని తీసుకుంటే లావు అవుతారు.

weight gain

బరువు పెరగడానికి పీనట్ బట్టర్ బాగా సహాయం చేస్తుంది పీనట్ బట్టర్ తీసుకోవడం వలన చక్కటి ఫలితాన్ని పొందొచ్చు. పీనట్ బట్టర్లో కొవ్వులతో పాటు ప్రోటీన్స్ కూడా ఉంటాయి కండరాలని బలంగా చేస్తాయి. లావు అవ్వడానికి పాలు కూడా సహాయం చేస్తాయి. పాలల్లో ప్రోటీన్స్ క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది లావు అవ్వాలనుకుంటే రోజూ పాలని తాగండి పాలని తాగితే బరువు పెరగొచ్చు.

యోగర్ట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది దీన్ని తీసుకొని మీరు లావు అవ్వచ్చు బరువు పెరగడానికి అవుతుంది. బరువు పెరగడం ఇష్టం లేదనుకుంటే కోడిగుడ్లలో తెల్ల సొనని తీసుకోండి బరువు పెరగాలనుకుంటే గుడ్లు మొత్తం తీసుకోండి. అలానే చీజ్ లో క్యాలరీలు ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి చీజ్ ని తీసుకోవడం వలన బరువు పెరగొచ్చు. సాల్మన్ తీసుకుంటే కూడా బరువు పెరగడానికి అవుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. బాదం బటర్ రెడ్ మీట్ ని కూడా బరువు పెరగాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు ఇవి కూడా బరువు పెరగడానికి హెల్ప్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version