కావాల్సిన పదార్థాలు:
కాలీఫ్లవర్ ముక్కలు- 2 కప్పులు
బియ్యం- 2 కప్పులు
కొత్తిమీర- కొద్దిగా
నూనె- 2 టేబుల్స్పూన్లు
ఉప్పు- తగినంత
బఠాణీలు- అరకప్పు
పచ్చిమిర్చి- 5
జీలకర్ర- అర టీస్పూను
అల్లంవెల్లుల్లి ప్లేస్ట్- అర టీస్పూను
పసుపు- చిటికెడు
గరం మసాలా- 1 టీస్పూను
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని పొడిపొడిగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఉప్పు, పసుపు వేసి కాలీఫ్లవర్ ముక్కలను 10 నిమిషాలు ఉడికించి ఆరబెట్టుకోవాలి. తర్వాత మరో ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆరబెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను బాగా ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత బాణలిలో నూనె పోసి వేడెక్కాక జీలకర్ర, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బఠాణీలు వేసి వేగించాలి. తర్వాత కాలిఫ్లవర్ ముక్కలు, అన్నం, గరం మసాలా, ఉప్పు వేసి 5 నిమిషాలు ఉంచి కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేయాలి. అంటే కాలీ ఫవర్ రైస్ రెడీ. దీన్ని మార్నంగ్ టిఫిన్ లేదా ఆఫ్టర్నూన్ లంచ్లా కూడా తీసుకోవచ్చు.