బ్రౌన్ రైస్ పెరుగన్నం రెసిపీ | Curd Brown Rice Recipe: మీరు మీ ఇంట్లో బ్రౌన్ రైస్ ని ఉపయోగిస్తారా..? అయితే సాధారణ రైస్ కంటే కూడా వివిధ రకాల వెరైటీలు మనం తయారు చేసుకోవచ్చు. పెరుగన్నం కూడా బ్రౌన్ రైస్ తో సులువుగా తయారు చేసుకోవచ్చు. దానిమ్మ గింజలు, కీరదోస ముక్కలు వంటివి యాడ్ చేసుకోవడం వల్ల మంచి రుచి వస్తుంది. అయితే మరి బ్రౌన్ రైస్ పెరుగన్నం ఎలా తయారు చేసుకోవాలి..?, దానికి కావలసిన పదార్ధాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం..
బ్రౌన్ రైస్ పెరుగన్నంకి కావలసిన పదార్థాలు:
అర కప్పు బ్రౌన్ రైస్
ఒకటిన్నర కప్పులు నీళ్లు
ఒక టీస్పూన్ నెయ్యి
ఒక స్పూన్ పెరుగు
ఒక కప్పు పాలు
ఒక టీస్పూను ఉప్పు
ఒక టీస్పూన్ పంచదార
ఒక టేబుల్ స్పూన్ కట్ చేసుకున్న మామిడిపండ్లు (ఆప్షనల్)
ఒక టేబుల్ స్పూన్ దానిమ్మ గింజలు (ఆప్షనల్)
ఒక టేబుల్ స్పూన్ కీరదోస ముక్కలు (ఆప్షనల్)
ఒక స్పూన్ నూనె
ఒక టీ స్పూన్ ఆవాలు
1 స్పూన్ జీలకర్ర
కరివేపాకు ఆకులు
ఇంగువ
1 స్పూన్ మినపప్పు
ఒకటి లేదా రెండు పచ్చిమిరపకాయలు
బ్రౌన్ రైస్ పెరుగన్నం తయారు చేసుకునే పద్ధతి:
ముందుగా బ్రౌన్ రైస్ ని నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పులు నీళ్లు వేసి అరగంట పాటు నానబెట్టాలి.
నానిన బియ్యాన్ని తీసుకుని సాల్ట్, నెయ్యి వేసి కుక్కర్లో ఉడికించుకోవాలి. నీళ్లు మరిగినప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి.
ఇప్పుడు వేడి వేడి పాలు దానిలో వేసి మరొకసారి మూత పెట్టేయాలి. 10 నిమిషాల పాటు అలా ఉంచి ఆ తర్వాత అందులో పెరుగు వేసి, కట్ చేసుకున్న కూరగాయలను, పండ్లను వేసేయాలి.
ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తరవాత మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ, కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టుకోవాలి. మీకు దొరికే పండ్ల తో పాటు సర్వ్ చేసుకోవచ్చు.