వేసవిలో ఈ ఆహార పదార్థాలను తీసుకోకండి..!

-

వేసవి అంటే వేడి ఎక్కువగా ఉంటుంది. పైగా తీవ్ర ఉష్ణోగ్రతలు వలన విపరీతంగా ఇబ్బంది ఉంటుంది. వేసవి లో డీహైడ్రేషన్, తలనొప్పి మొదలైనవి కూడా సులువుగా వచ్చేస్తాయి. చలవ చేసేవి తీసుకోవడం చేస్తే మంచిది. అయితే వేసవి కాలం లో ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అనేది ఈ రోజు చూద్దాం.

వేడి పానీయాలు:

ఒక పక్క నుండి వేడి చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఉదయం కాఫీ లేదా టీ తీసుకోకండి. క్రమం తప్పకుండా కాఫీ మరియు టీ తీసుకోవడం వల్ల శరీర వేడి పెరిగిపోతుంది. కాబట్టి కాఫీ టీలకు బదులుగా మీరు గ్రీన్ టీ లేదా ఇస్డ్ కాఫీ తీసుకోవచ్చు.

ఆయిల్ ఫుడ్స్:

వేసవి లో ఆయిల్ ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. డీప్ ఫ్రై చేసిన పదార్థాలు, జంక్ ఫుడ్స్ వేసవి లో తీసుకోవడం వల్ల అనారోగ్యం వస్తుంది. పైగా ఇది తీవ్రమైన రోగాలకు కూడా కారణమవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరం లో వేడి పెరిగి పోతుంది. అలానే రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.

ఐస్ క్రీమ్:

వేసవి లో వేడి ఎదుర్కోవడానికి చాలా మంది ఐస్ క్రీమ్ వగైరా వాటిని తింటూ ఉంటారు. దీనిలో కొవ్వు మరియు చక్కెర పదార్థాలు అధికంగా ఉంటాయి. దీని వల్ల ఊబకాయం మరియు మధుమేహం వచ్చే ప్రమాదం కలుగుతుంది. కాబట్టి ఐస్ క్రీం తినడం వలన అప్పటికే ఉపశమనం ఉంటుంది కానీ ఆరోగ్యానికి మంచిది కాదు.

Read more RELATED
Recommended to you

Latest news