ఎట్టిపరిస్థితుల్లో వేసవిలో వీటిని తీసుకోవద్దు.. ప్రమాదంలో పడతారు..!

-

వేసవి కాలంలో ఆరోగ్యం పై ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. వేసవికాలంలో చాలా మంది రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. డిహైడ్రేషన్ వడదెబ్బ నీరసం ఇలా ఎన్నో.. వేసవికాలంలో చాలా మంది చేసే చిన్న చిన్న తప్పులు వలన ఎంతో ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకని వేసవికాలంలో ఈ తప్పులని అస్సలు చేయొద్దు. మరి ఇక వేసవికాలంలో ఎటువంటి తప్పులను చేయకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. వేసవికాలంలో వీటికి చాలా దూరంగా ఉండాలి పొరపాటున కూడా వీటిని అస్సలు తీసుకోవద్దు. వేసవికాలంలో ప్రాసెస్డ్ ఫుడ్ కి దూరంగా ఉండాలి వీటిలో ప్రిజర్వేటివ్ సోడియం ఎక్కువగా ఉంటాయి వీటిని తీసుకోవడం వలన వికారం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ప్రాసెస్ ఫుడ్ కి బదులుగా మీరు మంచి పండ్లు, కూరగాయలు డైట్లో తీసుకోండి వీటి వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది తప్ప ఎలాంటి నష్టం ఉండదు. అలానే చాలా మంది వేసవికాలంలో కూడా ఒక కప్పు కాఫీతో రోజుని మొదలు పెడతారు నిజానికి కెఫెన్ డిహైడ్రేట్ చేస్తుంది దాంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానికి బదులుగా ఒక గ్లాసు కొబ్బరి నీళ్లతో మీ రోజున మొదలుపెట్టండి అప్పుడు రోజంతా కూడా హైడ్రేట్ గా ఉండొచ్చు నీటి శాతం కూడా బాడీలో ఎక్కువ ఉంటుంది.

వేసవికాలంలో గ్రీసి ఫుడ్ కి దూరంగా ఉండండి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారానికి బదులుగా మీరు కాల్చినవి ఉడకబెట్టినవి తీసుకోవడం మంచిది. గ్రీసి ఫుడ్ ని తీసుకుంటే కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. అదేవిధంగా వేసవి కాలంలో ఆల్కహాల్ కి దూరంగా ఉండండి ఆల్కహాల్ ని వేసవికాలంలో ఎక్కువ తీసుకుంటే డిహైడ్రేషన్ సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆల్కహాల్ ని తీసుకోకుండా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండండి. షుగర్ వుండే డ్రింక్స్ ని తీసుకోవడం మానేయండి వేసవి కాలంలో షుగర్ డ్రింక్స్ ని తీసుకోవడం వలన డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. దానికి బదులు కొబ్బరి నీళ్లు మంచినీళ్లు మంచిది. అలానే వేసవికాలంలో వదులుగా ఉండే బట్టల్ని వేసుకోండి టైట్ గా ఉండే దుస్తులు వేసుకోవడం వలన చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version