పాలతో చేసే పన్నీరు కంటే..ఈ సోయా తోఫాలో ఎన్నో ప్రోటీన్స్..తింటే లాభాలు మరెన్నో ఉన్నాయ్‌ తెలుసా..!

-

పాలతో తయారుచేసిన పన్నీరును మనం రుచికరమైన ఆహార పదార్థంగా అనుకుని తింటూ ఉంటాం. పన్నీరు పాలతో చేసుకునే బదులుగా సోయా పాలతో చేసుకుంటే..దాన్ని తోఫా అంటారు. అలాంటిది..మాములుగా పాలతో తయారుచేసిన పన్నీరుతో పోలిస్తే..అనేక రెట్లు ఎక్కువ లాభాన్ని, తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్లను అందిస్తుంది. మరీ..ఈ సోయా తోఫాఎలా తయారుచేసుకోవాలో, వీటిలో ఉండే పోషక విలువలు ఏంటో, ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తుందో ఈరోజు చూద్దాం.

సోయా తోఫా తయారు చేసే విధానం:

సోయ గింజల్లో హై ప్రొటీన్‌ ఉంటుంది. 43 గ్రాములు ప్రొటీన్‌ ఉంటుంది..వంద గ్రాముల గింజల్లోనే. సోయా చిక్కుడు గింజలను 12-13 గంటలపాటు నానపెట్టి..ఆ తర్వాత క్లీన్‌ చేయండి..అప్పుడు పైన తొక్కకూడా వచ్చేస్తుంది. ఆ పప్పును మిక్సీలో వేసి..కాస్త నీళ్లు ఎక్కువ పోసీ.. బాగా గ్రైండ్‌ చేయండి. ఆ తర్వాత ఫిల్టర్‌ చేస్తే..పిప్పిపోయి పాలు వస్తాయి. ఆ పాలను పొయ్యిమీద పెట్టి నార్మల్‌ పాలు కాగపెట్టినట్లే మరిగించండి. అవి మరిగాక..అందులో నిమ్మరసం పిండండి. పాలు విరిగిపోతాయి. ఆ తర్వాత గుడ్డలో పోసీ వడకొట్టండి..అడుగున వచ్చే వాటర్‌ని వదిలేయండి..ఆ క్లాత్‌లో ఉన్నదాన్ని నీట్‌గా ఒక కంటైనర్‌లో పెట్టుకుని..డీప్‌ ఫ్రిడ్జ్‌లో పెట్టండి. గట్టిగా అవుతుంది. ముక్కలుగా కట్‌ చేసుకుని..వంటల్లో వాడుకోవచ్చు.

100 గ్రాముల సోయా తోఫాలో ఉండే పోషకాలు

కాలరీలు 270..మాములు పన్నీరు కంటే..చాలా బలమైనది
కార్బోహైడ్రేట్స్‌ 9 గ్రాములు మాత్రమే..పిండిపదార్ధాలు తక్కువ ఉన్న ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది
ప్రోటీన్స్‌ 20 గ్రాములు ఉంటుంది.
ఫ్యాట్‌ 20 గ్రాములు. ఈ ఫ్యాట్‌లో పాలిఅన్‌సాట్చురేటెడ్‌ ఫ్యాట్‌ 11 గ్రాములు ఉంటుంది. ఇది మంచిఫ్యాట్‌..గుండెకు గుడ్‌కొలెస్ట్రాల్‌ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. సాట్యురేటెడ్‌ ఫ్యాట్‌ అనేది 2 గ్రాములు ఉంటుంది. ఇది మనం తినే ఆహారంలో తక్కువగా ఉండాలి.
ఫైబర్‌ 4 గ్రాములు ఉంది.
కాల్షియం 372 మిల్లీ గ్రాములు
పోలిక్‌ యాసిడ్ 27 మైక్రోగ్రాములు
పొటాషియం 144 మైక్రోగ్రాములు
సిలీనియమ్‌ 28 మిల్లీగ్రాములు ఉంటుంది.

తోఫా తినటం వల్ల శరీరానికి కలిగే ఆరోగ్య లాభాలు ఏంటంటే

100 గ్రాముల తోఫూలో సుమారుగా 25 మిల్లీ గ్రాముల ఐసోఫ్లావొన్స్‌ ఉంటాయి. ఫైటో ఈస్ట్రోజన్‌ మెయిన్‌గా ఉంటుంది. స్త్రీలల్లో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ బాగా పెరగడానికి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. ఈ హార్మోన్‌లోపం వల్లే..స్త్రీలల్లో అనేక రకాల సమస్యలు వస్తాయి. పీరియడ్‌ సైకిల్‌ కరెక్టు అవడానికి, నీటిబుడగలు రాకుండా చేసుకోవడానికి కూడా చాలా మంచిది
గుండెకు రక్తసరఫరా చేసే..రక్తనాళాల్లో కొలెస్ట్రాల్‌ పేరుకోకుండా..ఈ తోఫోలో ఉండే..ఐసోఫ్లావొన్స్‌ అనేవి..చాలా హెల్ప్‌ చేస్తున్నాయి. గుండె ఆరోగ్యానికి, హార్ట్‌ బ్లాక్స్‌ రాకుండా ఉండటానికి తోఫో చాలా మంచిదని 2002వ సంవత్సరంలో( St. Michael’s Hospital’s of Toronto ) కెనడావారు పరిశోధన చేసి నిరూపించారు..రోజుకు50 గ్రాముల తోఫోను..రెండువారాల. పాటు తీసుకుంటే..బ్లడ్‌లో ఉండే..బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ 15 శాతం తగ్గిపోతుందని వీళ్లు కనుగొన్నారు.
యూనివర్శిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోరిన్నియా( University Of Southern California) అమెరికా దేశస్తులు 2002వ సంవత్సరంలో ఈ తోఫా మీద మరొక పరిశోధ చేశారు..బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా..ఈ తోఫూను వారానికి మూడుసార్లు తీసుకుంటే..25 శాతం..క్యాన్సర్‌ వచ్చే అవకాశం తగ్గిపోతుందట.
మనదేశంలో..చాలామంది స్త్రీలకు ప్రొటీన్‌ డెఫిషియన్సీ ఉంటుంది..ఆ ప్రొటీన్‌ లోపాన్ని భర్తీ చేయడానికి, హార్మోన్స్‌ బ్యాలెన్స్ చేయడానికి..బలానికి, ఎముక పుష్టికి ఈ తోఫూ అందిస్తుంది. బ్లడ్‌ ఘగర్‌ కంట్రోల్‌ చేసుకవడానికి, ఒబిసిటీ పెరగకుండా ఉండటానికి, కార్ఫోహైడ్రేట్స్‌ తక్కువ ప్రొటీన్‌ ఎక్కువ ఉన్న తోఫూను అప్పుడప్పుడు మీ డైట్‌లో భాగం చేసుకుంటే చాలని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news