ఈ వర్షాకాలంలో చికెన్ తిని రోగాల బారిన పడేకంటే.. మటన్ తిని శరీరానికి కావాల్సిన కొన్ని పోషకాలను అందివ్వడం బెటర్. ఇది మంచి పౌష్ఠికాహారం కూడా. మరి అలాంటి మటన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం.
కావాల్సినవి :
మటన్ : అరకిలో
వెల్లుల్లి రెబ్బలు : 10
పచ్చిమర్చి : 4
పసుపు : టీ స్పూన్
గరం మాసాలా : టేబుల్‌స్పూన్
పెరుగు : కప్పు
పులావ్ ఆకులు : 2
నూనె : కప్పు
అల్లం పేస్ట్ : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత.
తయారీ :
ముందుగా మటన్ ముక్కలను టేబుల్‌స్పూన్ నూనె, పసుపు, ఉప్పు, బాగా గిలకొట్టిన పెరుగు పట్టించి రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోయాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, కట్ చేసిన పచ్చిమిర్చి, పులావ్ ఆకులు వేసి నిమిషంపాటు వేయించాలి. తర్వాత కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలను వేసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తర్వాత చివరగా గరంమసాలా వేసి బాగా కలిపి దించేయాలి. అంతే మటన్ 65 రెడీ.. దీన్ని అన్నంలోకి లేదా టమాటాసాస్‌తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది.