హెల్ది అయిన అరికెల లడ్డు ఎలా చేసుకోవాలి అంటే …!

-

పెరుగుతున్న కాలుష్యం వల్ల ప్రజలందరూ అనారోగ్యాలకు గురవుతున్నారు. దీని వల్ల ఇప్పుడు ప్రజలందరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో మన పూర్వీకుల ఆహారపు అలవాట్లను ఇప్పుడు మళ్ళి ఆచరణలోకి తెస్తున్నారు. పూర్వం అరికెలు, సామలు, జొన్నలు, రాగులు ఇలా పైబర్ ఎక్కువగా ఉండే శరీరానికి కావలసిన పోషకాలను అందించే ఆహారాన్ని ఎక్కువగా తినేవారు.

అరికెల లడ్డుకి కావలసిన పదార్థాలు: అరికల పిండి 2 కప్పులు, వేరుశనగలు ½ కప్పు, నువ్వులు ½ కప్పు, బెల్లం 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి ½ కప్పు, బాదం పప్పు ½ కప్పు, నెయ్యి 10 గ్రాములు.

తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. వేడి అయ్యిన నెయ్యిలో అరికెల పిండి వేసి వేయించాలి. తరువాత వేరుశనగలు, నువ్వులు, ఎండు కొబ్బరి తురుమును వేరు వేరుగా వేయించుకోవాలి. వీటిని ఒక మిక్సి జార్లోకి తీసుకుని బెల్లం, అరికెల పిండి కలిపి మిక్సి పట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకుని చిన్నగా కట్ చేసుకున్న బాదం ముక్కలు వేసి వేడి చేసిన నెయ్యి వేస్తూ లడ్డులుగా చుట్టుకోవాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన అరికెల లడ్డు రెడీ.

అరికెల లడ్డు లోని పోషక విలువలు: కేలరీస్ 110, ప్రోటీన్ 2.2 గ్రా, కార్బోహైడ్రేట్స్ 13 గ్రా, పైబర్ 1.7 గ్రా, కొవ్వు 5.6గ్రా, విటమిన్స్ 30.4 m g, మినరల్స్ 252.2 m g .

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version