ఎంతో రుచికరమైన పెసర పప్పు బర్ఫీ…!

-

పెసర పప్పు తో కూరలు మాత్రమే కాదు, ఎంతో టేస్టీ స్వీట్స్ కూడా తయారు చేయవచ్చు. ఎంతో రుచిగా నోట్లో వేసుకోగానే కరిగి పోయే పెసరపప్పు బర్ఫీ లను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దీనిలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి.

పెసర పప్పు బర్ఫీ కి కావలసిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, పంచదార 1 కప్పు, కోవా 1 కప్పు, నెయ్యి ¾ కప్పు, కిస్ మిస్, జీడి పప్పు, బాదం, పిస్తాల తరుగు.

తయారీ విధానం: ముందుగా పెసర పప్పు కడిగి 3 గంటల పాటు నాన పెట్టాలి. తరువాత నీళ్ళు వంపేసి ఆ పప్పుని మెత్తగా మిక్సి పట్టాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి కరిగించి పెసరపప్పు పేస్ట్ వేసి సన్నని మంట మీద ఉడికించాలి. పెసరపప్పు ఉడికిన తరవాత దించాలి. ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టి కోవా కరిగించాలి. అది వేడయ్యాక ముందుగా చేసుకున్న పెసరపప్పు ముద్దని వెయ్యాలి. ఈ మిశ్రం దగ్గరగా అయ్యే లోపు వేరే పాన్ లో పంచదార పాకం పట్టాలి. పంచదార లో ఒక కప్పు నీళ్ళు పోసి లేత పాకం పట్టాలి. ఈ పాకాన్ని దింపి కోవా మిశ్రమంలో వేసేయాలి. ఇది పూర్తిగా దగ్గరగా అయ్యాక దించి నెయ్యి రాసిన పళ్ళెంలో కి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి. వీటి పైన కిస్ మిస్, డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి.అంతే పెసరపప్పు బర్ఫీ రెడీ.

పోషక విలువలు: కేలరీస్ 292.20, కార్బోహైడ్రేట్స్ 28.20g, ప్రోటీన్స్ 6.30g, ఫ్యాట్ 17. 12g, పైబర్ 1.51g.

Read more RELATED
Recommended to you

Latest news