దేశాన్ని కలచివేసిన 12 ఏళ్ళ బాలిక మరణం…!

-

చత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన 12 ఏళ్ల బాలిక మరణించిన తీరు ఇప్పుడు దేశాన్ని కలవరపెడుతుంది. తెలంగాణ నుంచి తన ఇంటికి 150 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసి ఆమె మరణించింది. అసలు జరిగింది ఏంటీ అంటే… తన సొంత రాష్ట్రం నుంచి పనులు వెతుక్కుంటూ ఆమె ములుగు నియోజకవర్గంలోని ఏటూరు నాగారం వచ్చింది. అక్కడ ఆమె వలస కార్మికుల బృందంలో సభ్యురాలిగా ఉంది.

జామ్లో మక్దమ్ ఆ బాలిక పేరు. తెలంగాణలోని కన్నైగుడ గ్రామంలో మిరప పొలాల్లో ఆమె బృందం పని చేస్తుంది. లాక్ డౌన్ తో అన్ని రవాణా మార్గాలు మూసివేయడంతో వారు దాదాపు 150 కిలోమీటర్ల దూరం కాలినడకన ప్రయాణించాలని భావించారు. ఈ క్రమంలోనే బాలిక తన సొంత ఊరు వెళ్ళడానికి ఏప్రిల్ 15 న ప్రయాణం ప్రారంభించింది. మూడు రోజుల నడక తరువాత, ఏప్రిల్ 18 ఉదయం,

బీజాపూర్ జిల్లాలోని భండర్‌పాల్ గ్రామ సమీపంలో ఆమె నీరసం, అలసట తో ప్రాణాలు కోల్పోయింది. ఆమె పనిచేసిన ఏటూరు నాగారం నుంచి బీజాపూర్ మధ్య దూరం 150 కిలోమీటర్లు. ఆమె తన సొంత గ్రామానికి ఇంకా 50 ఉంది అనగా ప్రాణాలు కోల్పోయింది. శనివారం ఉదయం ఆమె భోజనం చేసిన తర్వాత కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించింది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news