గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకోని తాగితే..మలబద్ధకం సమస్య ఉండదట..!!

-

అదేంటో.. ఈ మలబద్ధకం చిన్నా పెద్దా తేడాలేకుండా అందర్నీ తెగ ఇబ్బంది పెడుతుంది..తినేవి తింటున్నాం, తాగేవి తాగుతున్నాం..అయినా డౌన్‌లోడ్‌ మాత్రం అవ్వడం లేదు. నేడు చాలమంది.. ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రెండు మూడు రోజులకు ఒకసారి వెళ్లేవాళ్లు కూడా ఉన్నారట.. సమస్య ఎక్కడ వచ్చిందంటే..దీన్ని చాలామంది లైట్‌ తీసుకుంటున్నారు. అసలు మలబద్ధకం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా..? అది ఫైల్స్‌కు దారితీస్తుంది, పెద్ద ప్రేగు క్యాన్సర్‌ వస్తుంది. గ్యాస్‌, ఆందోళన, హార్ట్‌ దగ్గర పెయిన్‌ ఇన్ని పంచాయితీలు ఉంటాయి. ఈ మలబ్ధకాన్ని తగ్గించే కొన్ని ఈజీ చిట్కాలు ఇప్పుడు చూద్దాం.. వీటితో మీరు ఈ సమస్యను త్వరగా బయటపడొచ్చు..

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. మీరు గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తిన్నప్పుడు, బ్యూట్రిక్ యాసిడ్ మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. అంటే మీ శరీరం ఆహారాన్ని మరింత సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది మీరు తరచుగా బాత్రూమ్‌కి వెళ్లడానికి, మీ మలం (పూప్) మరింత సులభంగా కదలడానికి సహాయపడుతుంది.

మీ కడుపు, పేగులు గరుకుగా, గట్టిగా, పొడిగా మారినప్పుడు మలబద్ధకం(Constipation) ఏర్పడుతుంది. ఇది బాత్రూమ్‌కు వెళ్లడం కష్టతరం చేస్తుంది. నెయ్యి మీ సిస్టమ్‌ను మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. తద్వారా వ్యర్థాలు బయటకు వచ్చేందుకు సులభతరం చేస్తుంది.

ఎలా తీసుకోవాలంటే..

మలబద్ధకం నుంచి తక్షణ ఉపశమనం పొందడానికి నెయ్యిని తీసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. 200 ml వెచ్చని నీటితో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కలపండి. ఏదైనా తినడం కంటే.. ముందుగానే ఉదయం పూట ఇది తీసుకోండి. నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తీసుకోవడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఒక కప్పు లేదా గ్లాసు వేడి పాలలో ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి జోడించడం వల్ల మలబద్ధకాన్ని తగ్గించవచ్చు.

మీకు దీర్ఘకాలిక మలబద్ధకం ఉంటే మీ భోజనంతో పాటు ఆవు నెయ్యి తినడం లేదా కనీసం ఒక నెల పాటు గోరువెచ్చని నీరు లేదా వేడి పాలతో నెయ్యి తీసుకోండి. ఒక నెల తర్వాత కూడా మీకు మలబద్ధకం ఉంటే, మీరు వైద్యుడిని సంప్రదించండి.

నెయ్యితో మలబద్ధకం చికిత్సలో సరైన ఫలితాల కోసం, ఉదయాన్నే ఖాళీ కడుపుతో దీన్ని తినడం మంచిది. యోగా(Yoga), వ్యాయామాలను చేయడం కూడా మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

పుష్కలంగా నీరు, ఇతర ద్రవాలు తాగడం వల్ల మీ మలాన్ని మృదువుగా చేయడంలో, సులభంగా బయటకు వెళ్లేలా చేయడంలో సహాయపడుతుంది.
రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలని లక్ష్యంగా పెట్టుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. రెగ్యులర్ శారీరక శ్రమ మీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచేందుకు, సాధారణ పేగు కదలికలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. రోజులో కనీసం 30 నిమిషాల వ్యాయామం చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version