కుక్కర్ నుంచి నీళ్లు లీక్ అవుతున్నాయా..? ఇలా చేయండి మళ్ళీ ప్రాబ్లెమ్ ఉండదు..!

-

కుక్కర్ నుంచి అప్పుడప్పుడు వాటర్ లీక్ అవుతూ ఉంటుంది. దాని వలన డబల్ పని అవుతుంది. కుక్కర్ నుంచి నీళ్లు లీక్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కాలని ఫాలో అవ్వడం మంచిది. ఎక్కువ మంది కుక్కర్లో వంట చేసే ముందు పాత్ర శుభ్రంగా ఉందా లేదా అని చూసుకుంటారు తప్ప రబ్బర్ గురించి పట్టించుకోరు. ఏదో ఫిట్ చేసాం కదా అని అనుకుంటారు. రబ్బర్ సరిగ్గా ఫిక్స్ చేయకపోతే కుక్కర్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. కాబట్టి టైట్ గా ఫిక్స్ చేసేటట్టు చూసుకోండి. అలాగే రబ్బర్ టైట్ గా ఉండడానికి డీప్ ఫ్రిజ్లో పెట్టండి.

ఇలా చేయడం వలన రబ్బర్ గట్టిగా మారుతుంది. తర్వాత కుక్కర్ కి పెట్టి జాగ్రత్తగా చూసుకోండి. లీక్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలాగే వంట చేసే ముందు రబ్బర్ ని వెనిగర్ నీటిలో అరగంట పాటు ఉంచాలి. తర్వాత కుక్కర్ మూతకి రబ్బర్ని అమర్చి వంట చేయాలి. ఇలా చేస్తే కూడా లీక్ అవ్వకుండా ఉంటుంది వంట చేసే ముందు కుక్కర్లో కొంచెం నూనె వేయండి.

దీని వలన కుక్కర్ లోని ఆహార పదార్థాలు పాత్రకి అంటుకోకుండా మృదువుగా వస్తాయి. కుక్కర్ మూతకి ఉన్న సేఫ్టీ ప్లగ్ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. కుక్కర్లో పదార్థాలు వండుతున్నప్పుడు మూతను బిగించండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూతను బిగిస్తే వాటర్ లీక్ అవ్వకుండా ఉంటుంది. వంట చేశాక కుక్కర్ విజిల్ ని శుభ్రం చేయాలి కుక్కర్లో ఎక్కువగా నీళ్లు పోయకూడదు అందులోని ఆహారాలను ఆహార పదార్థాలను బట్టి వాటర్ పోయాలి ఎక్కువ వాటర్ వల్ల కూడా నీళ్లు లీక్ అయిపోతాయి.

Read more RELATED
Recommended to you

Latest news