ఆయిల్ లేకుండా కోఫ్తా కర్రీ.. టేస్ట్ లో నెక్ట్స్ లెవల్..!

-

కోఫ్తా కర్రీ అంటే.. చాలామంది ఇష్టపడుతూ ఉంటారు.. కానీ అది తిన్నాకా ఆ మసాల వల్ల కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇంట్లో హెల్తీగా తిన్నాక ఎలాంటి ఇబ్బంది రాకుండా..చేసుకుందామా..!

కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు

నానపెట్టిన శనగలు ఒక కప్పు
టమోటా పేస్ట్ ఒక కప్పు
కొబ్బరి తురుము అరకప్పు
పెరుగు అరకప్పు
ఉల్లిపాయ ముక్కలు అరకప్పు
క్యారెట్ తురము అరకప్పు
నానపెట్టిన జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి ముక్కలు టూ టేబుల్ స్పూన్స్
వెల్లుల్లి రెబ్బలు 6-7
అల్లం తురుము ఒక టేబుల్ స్పూన్
లెమన్ జ్యూస్ ఒక టేబుల్ స్పూన్
తేనె ఒక టేబుల్ స్పూన్
మీగడ ఒక టేబుల్ స్పూన్
ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్
జీలకర్ర పొడి ఒక టీ స్పూన్
జీలకర్ర ఒక టీ స్పూన్
గరం మసాల ఆఫ్ టీ స్పూన్

తయారు చేసే విధానం..

చిన్న మిక్సి జార్ లో వెల్లులి రెబ్బలు, నైట్ నానపెట్టి క్లీన్ చేసిన శనగలు, పచ్చిమిర్చి, అల్లం, వేసి ముక్కాచెక్కాల తిప్పుకోండి. అందులో రెండు స్పూన్ల పెరుగు వేసి ముద్దలా పేస్ట్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్ లో తీసుకుని లెమన్ జ్యూస్, తేనె, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి కలుపుకుని ఉండల్లా చేసుకోండి. నాన్ స్టిక్ గుంటలు ఉన్న పాన్ తీసుకుని మీగడ రాసి ఈ కోఫ్తా బాల్స్ ను అందులో వేసి రెండు వైపులా కాల్చుకోండి. గ్రేవీ కోసం.. మిక్సీ జార్ లో పచ్చిమిర్చి ముక్కలు, నానపెట్టిన జీడిపప్పు, పెరుగు, కొబ్బరి తురుము వేసి గ్రైండ్ చేయండి.

పొయ్యి మీద నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో మీగడ వేసి జీలకర్ర, కరివేపాకు, జీలకర్రపొడి, ధనియాల పొడి వేసి ఇవి వేగిన తర్వాత..పేస్ట్ చేసుకున్న జీడిపప్పు గ్రేవీ వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత టమోటా పేస్ట్ కూడా వేయండి. లెమన్ జ్యూస్, గరం మసాల పొడి వేసి కొంచెం సేపు ఉంచండి. ఆ తర్వాత ముందు చేసుకున్న కోఫ్తా బాల్స్ వేసి కొత్తిమీర వేసి.. నాలుగు ఐదు నిమిషాలు ఉంచేసి తీసేయడమే..! సూపర్ టేస్టీగా ఉండే.. నాచురల్ కోఫ్తా కర్రీ రెడీ. ఉప్పులేకపోయినా సరే టేస్ట్ లో ఎలాంటి డౌట్ లేదు. చపాతీ, పరోటాలు, బిర్యానీ, ఫ్రైడ్ రైసుల్లోకి మంచి కాంబినేషన్.!

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version