పులిహోర తయారీ విధానం

-

కావలసిన పదార్థాలు :
నూనె : తగినంత
ఉప్పు : తగినంత
ఆవాలు : 1 టీస్పూన్
మినపపప్పు : అర టేబుల్‌స్పూన్
పచ్చెనగపప్పు : అర టేబుల్‌స్పూన్
పల్లీలు :12- 15
ఎండు మిర్చి : 2
కరివేపాకు : 6 – 7
అల్లంముక్కలు : అర టీస్పూన్
పసుపు : అర టీస్పూన్
నిమ్మరసం : 1 టేబుల్‌స్పూన్

తయారీ :
కడాయిలో నేనె వేడి చేయాలి. అందులో ఆవాలు, పచ్చెనగపప్పు, మినపపప్పు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత పల్లీలు వేసి వేయించాలి. పల్లీలు దోరగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేయించి, కరివేపాకు, అల్లంముక్కలు వేసి అరనిమిషంపాటు వేయించాలి. దీనికి పసుపు జోడించి కలుపాలి. ఆ తర్వాత అన్నం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి నిమిషంపాటు వేడిచేయాలి. పులిహోరాపై కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకొని తింటే ఆహా.. ఏమిరుచి అనాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news