ఆహా..! మద్దూర్ వడ ఎంతో రుచీరా..!

-

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి : అర కప్పు
మైదా పిండి : అర కప్పు
శనగపిండి : పావు కప్పు
ఉల్లిగడ్డ ముక్కలు : అర కప్పు
జీలకర్ర : పావు టీస్పూన్
కరివేపాకు : 1 రెబ్బ
పచ్చెనగపప్పు : 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి : 2
కట్ చేసిన కొత్తిమీర : 3 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి పాయలు : 3
పచ్చిమిర్చి : 2
వేడి నూనె : 3 టీస్పూన్లు
ఉప్పు : తగినంత
నీరు : తగినంత


తయారీ 
ఒక బౌల్ తీసుకొని అందులోకి బియ్యం పిండి, మైదాపిండి, శనగపిండి, ఉల్లిగడ్డ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చెనగపప్పు, ముక్కలుగా కట్ చేసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, వేడినూనె, తగినంత ఉప్పు, నీరు పోసి బాగా గట్టిగా చక్కలు చేసుకునే మాదిరిగా కలుపుకోవాలి. ఇందులో కావాలంటే పల్లీలు, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. కలిపిన పిండిన పక్కెన పెట్టుకొని పాలిథీన కవర్‌మీద నూనె రాసి పెట్టుకోవాలి.

పిండిని పెద్ద నిమ్మకాయంత సైజులో ఉండ మాదిరిగా చేయాలి. దీన్ని పలుచగా అలా అని మందంగా లేకుండా ఒక రకంగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఒత్తుకున్న వడలను నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేయాలి. వీటిని ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని చట్నీతో తింటుంటే బయటకు క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా ఎంత రుచిగా ఉంటాయో.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news