మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్ సినిమాకు రూ. 270 కోట్ల ఖర్చు అయిందంటూ కావాలని లీకులు ఇస్తూ కోరుకున్న రేటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. సినిమా బడ్జెట్ ఎక్కువైందని లీకులు ఇస్తూ ఫ్యాన్సీ రేట్ల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కవుట్ కాకపోవడంతో చేసేదిలేక ఇప్పుడు చరణ్ రేట్ల విషయంలో మెట్టు దిగుతున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఓవర్సీస్ రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మాలని చరణ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు 15 కోట్లకు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. సాహో రిలీజ్ రైట్స్ ఇచ్చిన సంస్థకే సైరా కూడా ఇచ్చినట్టు సమాచారం. ఇక ఇటీవల టాప్ హీరోల సినిమాలకు సైతం ఓవర్సీస్లో కలెక్షన్లు అనుకున్నట్టుగా రావడం లేదు. మహేష్ బాబు మహర్షి సినిమా వసూళ్లు ఆయనకు షాక్ ఇచ్చాయి. ఇక సాహో దెబ్బ మామూలుగా లేదు. దీంతో అక్కడ బయ్యర్లు కూడా ఎంత పెద్ద సినిమా అయినా భారీ రేట్లు పెట్టడం లేదు.
ఇక చరణ్ సైరాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా భారీ రేట్లకు అమ్మాని చరణ్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సాహో దెబ్బతో బయ్యర్లు ఎక్కువ రేట్లు పెట్టడం లేదట. ఇక చాలా చోట్ల గ్యారెంటీ రిటర్న్ బుల్ రేట్లకు కొంటున్నారట. సినిమాకు అనుకున్న వసూళ్లు రాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. సైరా కూడా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోతే ఇక రానున్న రోజులలో టాప్ హీరోలకు సంబంధించిన భారీ సినిమాలు మార్కెట్ చేయడం చాల కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి..