Mango Day 2021: ఇలా మామిడితో సులువుగా ఈ రెసిపీస్ చేసేయండి..!

-

పండ్లు అన్నిటి కంటే మామిడి పండు ఎంతో రుచిగా ఉంటుంది. మామిడి పండ్ల కోసం వేసవి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు మామిడిపండు ప్రియులు. నేడు నేషనల్ మ్యాంగో డే Mango Day . ఈ సందర్భంగా మనం మామిడి పండ్లతో సులువైన రెసిపీస్ ని చూసేద్దాం.

Mango Day Special Recipes
Mango Day Special Recipes

పెద్దలు పిల్లలు కూడా మామిడి పండ్లను ఎంతో బాగా ఇష్టపడతారు. ఈ రెసిపీస్ ని కనుక తయారు చేస్తే ఖచ్చితంగా వదిలిపెట్టరు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఆ రెసిపీస్ కోసం చూసేద్దాం.

రిఫ్రెషింగ్ మాంగో మిల్క్ షేక్

కావలసిన పదార్ధాలు:

  • రెండు మీడియం సైజు మామిడి పండ్లు
  • ఒకటిన్నర కప్పులు పాలు
  • ఒకటి నుండి మూడు టేబుల్ స్పూన్లు పంచదార
  • ఐస్ క్రీమ్

మ్యాంగో మిల్క్ షేక్ తయారు చేసే పద్ధతి

ముందు రెండు మీడియం సైజు మామిడి పండ్లను తొక్క తీసి ముక్కల కింద కట్ చేసి గ్రైండర్లో వేయాలి. దీనిలో ఒకటిన్నర కప్పులు పాలు వేసి మిక్సీ జార్లో ఒకసారి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమంలో ఒకటి నుండి మూడు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో రెండు నుండి మూడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి.

మెత్తగా దీనిని మిక్సీ పట్టాలి. మీరు కనుక కొంచెం చిక్కగా కావాలనుకుంటే కొన్ని పాలు పోసుకోవచ్చు. కావాలంటే పంచదారకు బదులు బ్రౌన్ షుగర్ లేదా బెల్లం వంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ని గ్లాస్ లో వేసుకుని పైన ఐస్ క్రీమ్ తో సర్వ్ చేసుకోండి.

అదే విధంగా మ్యాంగో లస్సీ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు దీనిని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వేసవిలో దీనిని ఎక్కువ మంది తయారు చేస్తూ ఉంటారు.

మ్యాంగో లస్సీ

కావలసిన పదార్థాలు:

  • మూడు నుండి నాలుగు మామిడి పండ్లు
  • నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు పంచదార లేదా తేనె
  • అర టీ స్పూన్ యాలకుల పొడి
  • ఎనిమిది నుండి పది కుంకుమ పువ్వు రేకలు
  • ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్
  • రెండు కప్పుల పెరుగు

మ్యాంగో లస్సీ తయారు చేసుకునే విధానం:

ముందుగా మామిడి పండ్లు తొక్క తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి. వీటన్నిటినీ ఒక బ్లెండర్ లో వేసి నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్లు పంచదార లేదా తేనె వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దానిలో అర టీ స్పూన్ యాలకుల పొడి, కుంకుమ పువ్వు రేకలు, రోజ్ వాటర్ వేసి బ్లెండ్ చేయాలి.

ఇది మొత్తం స్మూథ్ అయ్యాక రెండు కప్పుల పెరుగు కూడా వేసి బ్లెండ్ చేయాలి కావాలంటే రెండు నుండి మూడు టేబుల్ స్పూన్లు క్రీమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుని బ్లెండ్ చేయండి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news