చాలామంది నెయ్యిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా నచ్చిన ఆహార పదార్థాలలో నెయ్యిని వేసుకుని తింటూ ఉంటారు. మీరు నెయ్యిని ఎక్కువ తీసుకుంటున్నారా..? అయితే పక్కా వీటిని మీరు తెలుసుకోవాల్సిందే. నెయ్యి వలన కొన్ని లాభాలు ఉన్నాయి. అందులో సందేహమే లేదు. కానీ నెయ్యి తీసుకోవడం వలన కొన్ని నష్టాలు కూడా తప్పవట. నెయ్యి తినే వాళ్ళు కచ్చితంగా వీటిని గమనించండి. నెయ్యిని లిమిట్ గానే తీసుకోవాలి అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. నెయ్యిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండు స్పూన్లు రోజుకి తీసుకోవచ్చు. అంతకు మించి మాత్రం తీసుకోకూడదు.
నెయ్యిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్కువ మోతాదులో నెయ్యిని తీసుకోవడం వలన బరువు కూడా పెరిగిపోతారు. అధిక బరువు కారణంగా ఉబకాయం ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమస్యలు ఏమి లేకుండా ఉండడానికి పక్కా నెయ్యిని కంట్రోల్ చేసుకోవాలి,
బాగా ఎక్కువగా నెయ్యిని తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అధికమ మోతాదులో నెయ్యిని తీసుకోవడం వలన బ్లోటింగ్ ఇలా పలు సమస్యలు వస్తాయి. డిస్ కంఫర్ట్ గా కూడా ఉంటుంది. ఎక్కువ మోతాదులో నెయ్యిని తీసుకోవడం వలన కొవ్వు శాతం పెరిగిపోతుంది. లివర్ సమస్యలు కూడా వస్తాయి లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే కూడా నెయ్యిని తగ్గించడం మంచిది. చూసారా నెయ్యి వలన ఎన్ని నష్టాలు వుంటాయో. కాబట్టి లిమిట్ గా తీసుకోండి రెండు స్పూన్ల కంటే ఎక్కువ తీసుకుంటే మాత్రం ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.