సూపర్‌ టేస్ట్‌తో ఇంట్లోనే ఇలా హలీం తయారుచేసుకోండి!

-

కరోనా నేపథ్యంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా బయటి ఆహాం తినకపోవడమే మేలు. కానీ, రంజాన్‌ అంటేనే హలీం. ఈ మాసంలో హలీం తినకుండ ఉండలేరు. అయితే ఇప్పుడు మన ఇంట్లోనే ఎంతో టేస్టీ అయిన హలీం ని తయారు చేసుకుందాం. మతాలతో సంబంధం లేకుండా రుచికరమైన హలీమ్‌ కోసం జనాలు బారులు తీరుతారు. అయితే గత ఏడాది కరోనా కారణంగా హలీం తయారీ నిలిచిపోయింది. కానీ, ఈసారి మాత్రం మళ్లీ హలీం సందడి మొదలైంది. హైదరాబాద్‌ సహా అన్ని ప్రాంతాల్లో హలీం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా కారణంగా బయటి ఆహారం తినేందుకు చాలా మంది భయపడుతున్నారు. వారికోసమే ఘుమఘమలాడే హలీం తయారీ పద్ధతిని తెలుసుకుందాం.


హలీం తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్‌ 500 గ్రాములు,
గోధుమ రవ్వ–4 టేబుల్‌ స్పూన్లు,
కంది పప్పు– 2 స్పూన్లు,
శనగ పప్పు, మినపప్పు,ఎర్ర పప్పు, పెసర పప్పు, స్పూన్లు,నువ్వులు – 2 స్పూన్లు చొప్పున తీసుకోవాలి
బాదం–10, జీడిపప్పు–10, మిరియాలు–20, లవంగాలు–30, యాలకులు–15, దాల్చిన చెక్క–4, జీలకర్ర–టీ స్పూన్, తరిగిన ఉల్లి–2 కప్పులు, నెయ్యి–4 టేబుల్‌ స్పూన్లు.
షాహిజీరా– స్పూన్, అల్లం వెల్లులి పేస్ట్‌–2 టేబుల్‌ స్పూన్లు, పచ్చి మిర్చి–10, కొత్తి మీర–గుప్పెడు, పుదీనా–గుప్పెడు, గులాబీ రేకులు–గుప్పెడు, పెరుగు–3 టేబుల్‌ స్పూన్లు.

తయారీ విధానం

ముందుగా బాండీలో ఉల్లిపాయలను ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్‌ కలర్‌లో క్రిస్పీగా వేయించుకోవాలి. ఆ తర్వాత గోధుమలు, అన్ని రకాల పప్పులు, నువ్వులు, మిరియాలు, లవంగాలు సహా అన్ని మసాలాలు, డ్రైఫ్రూట్స్‌ను మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. మెత్తగా కాకుండా, కొంచెం రవ్వ మాదిరి ఉండాలి. అన్నింటినీ కలిపి పొడిచేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టావ్‌పై కుక్కర్‌ పెట్టి 3 టేబుల్‌ స్పూన్ లు నెయ్యి వేసుకోవాలి. కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేయాలి. పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న చికెన్‌ వేసుకోవాలి. కాస్త వేగిన తర్వాత ముక్కలు మునిగేవరకు నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఒక కప్పు బ్రౌన్‌ ఆనియన్, పచ్చిమిర్చి ముక్కలు, గులాబీ రేకులు, కొత్తిమీర, పుదీనా, పెరుగు, తగినంత ఉప్పువేసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువా పోస్తే.. హలీం పలుచగా అవుతుంది. మరీ తక్కువగా పోస్తే గట్టిగా ఉంటుంది. అందుకే కాస్త అటూ ఇటూగా పోయాలి. ఇక కుక్కర్‌ మూతపెట్టి పెద్ద మంటపై నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూతతీసి రుచి చూడాలి. అవసరమైతే మసాలాలు వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైతే నీరు పోసుకోవాలి. ఆ తర్వాత చికెన్‌ ముక్కలను మెషర్‌తో మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నని మంటపై 30 నిమిషాలు ఉడికించాలి. చివరగా హలీంని వేరే పాత్రలోకి తీసుకొని.. మరో 2 టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. బ్రౌన్‌ ఆనియన్తో గార్నిష్‌ చేసుకోవాలి. అంతే ఘుమఘుమలాడే హలీం రెడీ. హోటల్‌ కంటే రుచికరంగా తయారవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news