టేస్టీగా బ్రౌన్ రైస్ తో జీరా రైస్ ఇలా చేసేయండి..!

-

బ్రౌన్ రైస్ తో సులువైన రెసిపీస్ ని ఎన్నో తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రోజు మనం బ్రౌన్ రైస్ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా మనం మామూలు బియ్యంతో ఎలా అయితే వంటలు చేసుకుంటామొ అదే విధంగా బ్రౌన్ రైస్ తో కూడా మనం రకరకాల వంటకాల్ని తయారు చేసుకోవచ్చు. పైగా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అలాగే సింపుల్ గా చేసుకోవచ్చు.

బ్రౌన్ రైస్ జీరా రైస్ కి కావలసిన పదార్ధాలు:

అర కప్పు బ్రౌన్ రైస్
ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
ఒక ఎండుమిర్చి
ముక్కలు చేసుకున్న ఉల్లిపాయలు
ఉప్పు రుచికి సరిపడా
నూనె ఒక టేబుల్ స్పూన్

తయారు చేసుకునే పద్ధతి:

ముందుగా బ్రౌన్ రైస్ ని రెండు గంటల పాటు నానబెట్టి కోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో నూనె వేసి నూనె వేడెక్కిన తరవాత ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించండి. ఇప్పుడు నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ ని కూడా అందులో వేసేయండి. దీనిలో ముప్పావు కప్పు నీళ్ళు వేసి, రుచికి సాల్ట్ వేసి మూత పెట్టండి. ఆ తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత అర టీ స్పూను నూనె వేయండి. అంతే వేడి వేడిగా బ్రౌన్ రైస్ జీరా రైస్ ని సర్వ్ చేసుకోండి.

డయాబెటిస్ ఉన్నవారు బ్రౌన్ రైస్ ను తినవ‌చ్చా ?

ఇలా ఈజీగా మష్రూమ్ బ్రౌన్ రైస్ తయారుచేసుకోండి..!

Read more RELATED
Recommended to you

Exit mobile version