సమ్మర్ స్పెషల్ ‘కోల్డ్ కాఫీ’ని ఎలా తయారు చేయాలంటే?

-

అసలే ఎండాకాలం. ఎండలు మండిపోతున్నయి. ఈ సమయంలో వేడి వేడి కాఫీలు, టీలు తాగితే ఇంకేమన్నా ఉందా? బాక్స్ బద్దలయిపోతుంది. అయితే.. చాలామందికి కాఫీలు కానీ టీలు కానీ తాగనిదే నిద్ర పట్టదు. కాఫీ, టీ తాగితేనే వాళ్లకు ఆరోజు గడుస్తుంది. అటువంటి వాళ్లు కోల్డ్ కాఫీని ట్రై చేయొచ్చు.

కోల్డ్ కాఫీని తయారు చేయడానికి ఒక స్పూన్ కాఫీ పౌడర్, రెండు స్పూన్ల నీళ్లు, ఒక స్పూన్ చక్కెర, రెండు కప్పుల చల్లని పాలు, ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్, ఒక టేబుల్ స్పూన్ చాకొలేట్ సిరప్ ఉంటే చాలు.. చల్లచల్లని కాఫీని తయారు చేయొచ్చు.

ముందుగా… కాఫీ పౌడర్ కు నీళ్లను జత చేసి దాన్ని బాగా కలపాలి. ఆ మిశ్రమంలో చక్కెరను కలిపి గ్రైండ్ చేయాలి. చక్కెర కరిగేలా బ్లెండ్ చేయాలి. దాంట్లో పాలు, వెనీలా ఐస్ క్రీమ్ కలిపి మరోసారి బ్లెండ్ చేయాలి. అంతే.. ఆ మిశ్రమాన్ని ఓ గ్లాస్ లో పోసుకొని తాగేయడమే. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఉంటే కోల్డ్ కాఫీని చిటికెలో తయారు చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version