సమ్మర్ స్పెషల్ : పుచ్చకాయ ఐస్ క్రీమ్ ని ఇలా ఈజీగా చేసేయండి…!

-

వేసవి లో మనకి పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని జ్యూస్, ఫ్రూట్ సలాడ్ ఇలా వివిధ రకాలుగా ఇంట్లో తయారు చేసుకుంటూ ఉంటాము. అయితే మరి కొంచెం వెరైటీగా పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసేయండి. మరి పుచ్చకాయ ఐస్క్రీం కి కావాల్సిన పదార్థాలు, తయారు చేయాల్సిన విధానం కూడా ఇప్పుడే చూసేద్దాం..! మరి ఆలస్యం ఎందుకు దీనికి సంబందించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

 

 

పుచ్చకాయ ఐస్ క్రీమ్ కి కావలసిన పదార్ధాలు :

ఒక పుచ్చకాయ
కండెన్స్డ్ మిల్క్
క్రీమ్
మొక్కజొన్న పిండి
వెన్నెల ఎసెన్స్
పంచదార

పుచ్చకాయ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం:

ముందుగా పుచ్చకాయ ముక్కలు కింద కోసుకోవాలి. గింజలు పక్కకి తీసేయాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిని జ్యూస్ కింద చేసేయండి. ఇప్పుడు ఒక మూడు కప్పుల జ్యూస్ ని ప్యాన్ లో వెయ్యండి. దానిలో పంచదార కూడా వేయండి. ఇప్పుడు దానిని బాగా మరిగించండి.

ఇప్పుడు ఒక కప్పు తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్ ను వేయండి. దానిలో కొద్దిగా పుచ్చకాయ రసం వేయండి. ఇప్పుడు దానిని ఆ మిశ్రమంలో కలిపేయండి. దానిలో కొద్దిగా వెన్నల ఎసెన్స్ కూడా వేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లగా అవ్వనివ్వండి.

ఇప్పుడది ఒక్కసారి చల్లగా అయిపోయిన తర్వాత ఫ్రిజ్ లో రెండు గంటల పాటు పెట్టండి. రెండు గంటల తర్వాత ఒక జార్ తీసుకొని అందులో పావు కప్పు క్రీమ్ వేయండి. ఇప్పుడు అంతా కూడా ఇందులో వేసేయండి. ఒకసారి మొత్తం అంతా కలిపిన తర్వాత రెండు నుంచి మూడు గంటల పాటు ఫ్రిజ్లో ఉంచండి. ఇప్పుడు ఐస్క్రీమ్ ని సర్వ్ చేసుకోండి అంతే.

Read more RELATED
Recommended to you

Latest news