నోట్లో పెట్టుకోగానే క‌రిగిపోయే క‌లాకండ్‌.. ఒక్కసారి తయారు చేసి చూడండి

-

kalakand sweet recipe in telugu
kalakand sweet recipe in telugu – source & Credits : Divija’s World

పాలతో చేసే రుచికరమైన కలాకండ్‌ని ఇప్పుడు మన ఇంట్లోనే తక్కువ సమయంతో చేసుకోవచ్చు.. అచ్చు మిఠాయి షాప్‌లో ఉండేలాగానే రుచిగా. అయితే ఒక్కోసారి పాలు విరిగిపోతాయి కదా.. అప్పుడు ఆ పాలను పారబోయకుండా క‌లాకండ్ త‌యారు చేయ‌డానికి సిద్ధ‌మైపోండి. అలా కాకుండా పాలలో నిమ్మకాయ కలిపి కూడా ఈ రెసిపీ చెసుకోవచ్చు.. త‌క్కువ టైంలో త‌క్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఎలా త‌యారు చేయాలో చూసేయండి.

కావాల్సిన ప‌దార్థాలు :
ఫుల్ క్రీమ్ మిల్క్ : 1 లీ.
చ‌క్కెర : 100 గ్రా.
ఇలాచీ : 2
నిమ్మ‌ర‌సం : 2 టేబుల్‌స్ప‌న్లు
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్

త‌యారీ :
ముందుగా స్ట‌వ్ మీద క‌డాయి పెట్టుకొని వేడి చేసుకోవాలి. త‌ర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్‌ను క‌డాయిలో వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. స్ట‌వ్‌ను సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. ఈ లోపు నిమ్మ‌ర‌సంలో రెండు టేబుల్‌స్పూన్ల నీరు పోసి బాగా క‌లుపుకోవాలి. ఒక లీ. పాలు అర లీ. వ‌చ్చేంత‌వ‌ర‌కు కాగ‌బెట్టుకోవాలి. త‌ర్వాత క‌లిపి పెట్టుకున్న నిమ్మ‌ర‌సం నీటిని పాల‌లో వేసుకోవాలి. దీనివ‌ల్ల పాలు విరిగిపోతాయి. త‌ర్వాత చ‌క్కెర కూడా వేసి క‌లుపుకుంటూ ఉండాలి. మిశ్ర‌మం కొంచెం ద‌గ్గ‌ర ప‌డిన త‌ర్వాత ఇలాచీ పౌడ‌ర్ వేసుకోవాలి. త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని నెయ్యి రాసుకున్న ప్లేట్‌లోకి స‌ర్వ్ చేసుకోవాలి. ఇది చ‌ల్లారిన త‌ర్వాత మంచి షేప్‌లో క‌ట్ చేసుకోవాలి. ఇక అంతే అదిరిపోయే టేస్ట్‌తో క‌లాకండ్ త‌యారైపోయిన‌ట్లే!

Read more RELATED
Recommended to you

Latest news