ప్రతి ఇంటికి టీ-ఫైబర్ కనెక్టివిటీ – మంత్రి శ్రీధర్‌ బాబు ప్రకటన

-

ప్రతి ఇంటికి టీ-ఫైబర్ కనెక్టివిటీ అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు మంత్రి శ్రీధర్‌ బాబు. మీ సేవ మొబైల్ యాప్ ను ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టీ-ఫైబర్ కనెక్టివిటీ ప్రతి ఇంటికి అందుబాటులోకి వస్తుంది..ఒక కంప్యూటర్ కి సంబంధించిన అన్ని అంశాలను టీ-ఫైబర్ ద్వారా అందిస్తున్నామని తెలిపారు. టీ-ఫైబర్ కోసం కొన్ని ప్రాంతాల్లో అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది.. క్లియర్ అయ్యేలా చేస్తామని ప్రకటన చేశారు.

Minister Sridhar Babu

అభివృద్ధి కేవలం హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితం కాదని ముఖ్యమంత్రి అన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని నైపుణ్యాన్ని కూడా బయటకు తీసుకువచ్చేలా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. ఉపాధి పెంచే ప్రతి పరిశ్రమ మాకు ముఖ్యమని… చిన్న.. మధ్య తరగతి సంస్థలను ఎంకరేజ్ చేయాలని పదేళ్ల తరువాత కొత్త MSME పాలసీ తీసుకువచ్చామని పేర్కొన్నారు. చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు గత పదేళ్లుగా దాదాపుగా 4 వేల కోట్లు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు..దశల వారిగా MSME ఇన్సెంటివ్స్ ఇస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version