వైసీపీ పార్టీ ఎంపీ బీద మస్తానరావు కీలక ప్రకటన చేశారు. వైసీపీ పార్టీకి రాజీనామా చేసి.. కీలక వ్యాఖ్యలు చేశారు బీద మస్తానరావు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాను….రాజకీయ భవిష్యత్ త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు బీద మస్తానరావు. తన వ్యక్తిగత కారణాలే నా రాజీనామా కు కారణం అన్నారు బీద మస్తానరావు.

సాంకేతికంగా, సంప్రదాయంగా రాజ్యసభ ఛైర్మన్ కొన్ని ప్రశ్నలు అడిగారని…. ఇష్టపూర్వకంగానే రాజీనామా లు చేశామని ఇద్దరం చెప్పామని తెలిపారు బీద మస్తానరావు. రాజ్యసభ సభ్యునిగా జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతలు చెప్పారు. నాకు ముందు నుంచి కూడా జాతీయ రాజకీయలంటేనే ఇష్టమని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల పట్ల పెద్దగా ఇష్టం లేదని వెల్లడించారు బీద మస్తానరావు. అయితే.. బీద మస్తానరావు చేసిన జాతీయ రాజకీయాల వ్యాఖ్యలు.. చూస్తుంటే.. బీద మస్తానరావు బీజేపీ పార్టీలోకి వెళుతున్నట్లు సమాచారం.