ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి లో షడ్రుచులు ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్క లాగా తయారు చేస్తారు కానీ నిజంగా ఎలా చేసినా అది అమృతం గానే ఉంటుంది. ఉగాది రోజు తప్పకుండా పచ్చడి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క రుచి కూడా ఎంతో ఆరోగ్యం.

 

దీనిలో వేపపువ్వు, చెరుకు, మామిడికాయ, చింతపండు, ఉప్పు, కారం వేస్తారు. అయితే ఈ రోజు ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..!

ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు:

ఒక మామిడి కాయ
అరకప్పు వేప పువ్వు
కొబ్బరి ముక్కలు అర కప్పు
చింతపండు వంద గ్రాములు
బెల్లం 100 గ్రాములు
రెండు మిరపకాయలు
ఒక అరటిపండు
చెరుకు ముక్కలు కొద్దిగా
ఉప్పు సరిపడేంత

ఉగాది పచ్చడి తయారు చేసుకునే విధానం:

ముందుగా మీరు వేపపువ్వు ని కాడలు లేకుండా వేరు చేసుకోండి. అలానే చింతపండులో కొద్దిగా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. మామిడికాయ, మిరపకాయలు, కొబ్బరిని సన్నగా తరుక్కోవాలి. అలానే మీరు ఇష్టమైన పండాలని కూడా తరుక్కుని పెట్టుకోండి.

బెల్లాన్ని కొద్దిగా తరమండి ఇప్పుడు తురిమిన బెల్లాన్ని చింతపండు గుజ్జులో వేసి మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, మిరపకాయ ముక్కలు కూడా వేసి కలపండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసి వేప పువ్వును కూడా వేసేయండి. షడ్రుచుల పచ్చడి సిద్ధమైపోయింది. ఇక ఉగాది పచ్చడిని పంచుకుని తినేయండి.