సాధారణంగా తెలంగాణలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కొన్ని కొన్ని అంశాలు కీలకం గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మంత్రుల వైఖరి సీఎం కేసీఆర్ ను కాస్త ఇబ్బంది పెడుతోంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మంత్రులు నియోజకవర్గాల్లో తిరగకుండా హైదరాబాదులో ఉండటంతో సీఎం కేసీఆర్ కూడా వారి విషయంలో సీరియస్ గానే ఉన్నారు.
రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతాపార్టీ మంత్రులను ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. మంత్రుల వ్యవహారాల మీద ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను ప్రస్తావించే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినా సరే చాలా మంది కొన్ని కొన్ని అంశాలను పట్టించుకునే ప్రయత్నం చేయక పోవడంతో సమస్య తీవ్రత పెరిగి పోతోంది. మంత్రులు సీఎం కేసీఆర్ కు నివేదికలు ఇవ్వడం లేదని నాగార్జునసాగర్ ఎన్నికలకు సంబంధించి వాస్తవ నివేదికలను పంపించే ప్రయత్నం చేయక పోవడంతో సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు.
సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు అని తెలిసినా సరే చాలా మంది మంత్రులు నాగార్జునసాగర్ వెళ్లడానికి కూడా ముందుకు రాలేదు అని అంటున్నారు. చాలామంది నేతల్లో ఉత్సాహం అనేది కనపడటం లేదు అనే భావన కూడా ఉంది. నాగార్జునసాగర్ లో మంత్రులు ప్రచారం చేస్తే పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయినా సరే దీనిని కూడా వాడుకోలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారని ఇమేజ్ ఉన్న వాళ్లు కూడా బయటకు రావడం లేదని అంటున్నారు.