ఒక్కోసారి మనకి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. కొన్ని లక్షణాలు బట్టి మనం విటమిన్ బి12 లోపం ఉందని తెలుసుకోవచ్చు. విటమిన్ బి 12 చాలా అవసరం. మన కండరాలని బలంగా దృఢంగా ఉంచుతుంది. బి12 లోపం ఉన్నట్లయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాంతులు, గ్యాస్, వికారం వంటి ఇబ్బందులు ఉన్నట్లయితే విటమిన్ బి12 లోపం ఉందని తెలుసుకోవచ్చు. తలనొప్పి వస్తున్నట్లయితే కూడా అది విటమిన్ బి12 లోపమని అర్థం చేసుకోవాలి.
విటమిన్ బి12 లోపం ఉన్నట్లయితే నిద్రలేమి సమస్య, రాత్రి నిద్ర పట్టకపోవడం వంటి ఇబ్బందులు కలుగుతాయి. ఇలాంటి ఇబ్బందులు ఉంటే వైద్యుని సలహా తీసుకోవడం మంచిది. అప్పుడు విటమిన్ ఈ లోపం నుంచి బయటపడొచ్చు. అలాగే ఈ లోపం ఉన్నట్లయితే కాళ్లు నొప్పులు, కండరాలు నొప్పులు వస్తాయి. విటమిన్ బి12 లోపం లేకుండా చూసుకోవాలి లేదంటే అనవసరంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది..
అలాగే కండరాలు బలహీనంగా మారినా నీరసంగా ఉన్నా కూడా విటమిన్ బి12 లోపం అని అర్థం చేసుకోవాలి. సాల్మన్ వంటి కొవ్వు చేపల్ని తీసుకుంటే విటమిన్ బి12 లోపం నుంచి బయటపడవచ్చు. అలాగే పాలు, చీజ్, పెరుగు వంటి ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా ఈ సమస్య నుంచి బయటపడడానికి అవుతుంది. కోడిగుడ్లలో కూడా విటమిన్ బి12 వల్ల ఎక్కువ ఉంటుంది కోడి గుడ్లు తీసుకుంటే కూడా ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చు.