రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం చేసారు ఏబీవీపీ నాయకులు. జిల్లాలో గురుకుల హాస్టల్స్ లో వరుస సంఘటనలపై నేతన్న విగ్రహం వద్ద దిష్టి బొమ్మ తో ర్యాలీ నిర్వహించి దిష్టి బొమ్మ దగ్ధం చేసిన ఏబీవీపీ నాయకులు… సీఎం, ఆది శ్రీనివాస్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు నాయకులు. గురుకుల పాఠశాలలలో నెల రోజులుగా నిత్యం ఏదో ఒక ఘటన జరుగుతుందని పట్టించుకొనే నాథుడు లేదని అవేదన వ్యక్తం చేశారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో ఇటీవల విద్యార్థినిలను టీచర్ కొట్టడంతో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగిందని అన్నారు. ఇళ్ళంతకుంట మండల కేంద్రంలో ఒక విద్యార్థి పాము కాటు గురి కాగా, విర్ణపల్లి మండల కేంద్రంలో కేజీబీవీ పాఠశాలలో ఒక విద్యార్థిని హాస్టల్ భవనంపై దూకడంతో గాయాలు అవ్వగా, గంభీరావుపేట మండల కేంద్రంలో విద్యార్థినులపై లైంగిక వేదింపులు గురవుతున్నారు.
జిల్లాలో ఉన్న హాస్టళ్లను పట్టించుకోని అధికారులు ఎక్కడ అని ప్రశ్నించారు. జిల్లాకు ప్రతినిత్యం వహిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వరుస సంఘటనలపై ఎందు రివ్యూ చేయలేదనీ ప్రశ్నించారు. విద్యార్థులు నెల రోజులుగా అనేక ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు వారి సమస్యలపై బయటకు చెప్పుకుంటే అధికారులు వారిని ఇబ్బందులు గురి చేస్తున్నారని అన్నారు. మేము అనేక సార్లు జిల్లాలో ఉన్న హాస్టల్స్ పై ఫిర్యాదులు చేసిన ప్రభుత్వంగాని అధికారులు ఎందుకు కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి విద్య శాఖకు అసలు మంత్రి ఎందుకు లేరు అని ప్రశ్నించారు.