వర్షాకాలం ఆరోగ్యంగా ఉండడానికి పాటించాల్సిన డైట్..

-

వర్షాకాలం వచ్చేంది. చిటపట చినుకులు కురిసే ఈ కాలంలో బాక్టీరియా సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోషక విలువలు కలిగి, రోగనిరోధక శక్తికి బలాన్నిచ్చే డైట్ పాటించాలి. ఆ డైట్ ఎలా ఉండాలనేది ఇక్కడ చూద్దాం.

విటమిన్-సి అధికంగా ఉన్న ఆహారాలు

బొప్పాయ, నిమ్మకాయ, టమాట మొదలగునవి ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన విటమిన్ ని అందించి రోగనిరోధక శక్తికి బలాన్ని చేకూరుస్తాయి.

బయట తినవద్దు

ఎట్టి పరిస్థితుల్లోనూ బయట తినకండి. అన్నం, కూర వండుకోవడం ఇబ్బందిగా ఉంటే, కిచిడి చేసుకోండి. అంతేకానీ బయట ఆహారాలు మాత్రం ముట్టుకోవద్దు.

మసాలాలు దట్టించండి.

పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి మొదలైనవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. సుగంధ ద్రవ్యాలతో చేసిన టీ లేదా అల్లం నిమ్మరసం కలిపిన పానీయాలు సేవించాలి.

కావాల్సినన్ని నీళ్ళు తాగండి

అది ఏ కాలమైనా సరే మీ శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు ఖచ్చితంగా తాగాలి. వర్షాకాలంలో నీళ్ళు తాగే విషయంలో తప్పులు చేస్తుంటారు. అలా కాకుండా శరీరానికి సరిపోయినన్ని నీళ్ళు తాగితే బాగుంటుంది.

సరిగ్గా వండండి

మార్కెట్ నుండి కూరగాయలు తీసుకురాగానే సరిపోదు. వండేటపుడు జాగ్రత్త వహించాలి. సరైన వేడి మీద ఉడకబెడితే అందులో ఉన్న బాక్టీరియా చనిపోతుంది. లేదంటే ఇబ్బంది అవుతుంది. అలాగే పొట్టు తీసేసే ఆహారాలు తీసుకోండి. అరటి పండ్లు, మామిడి కాయలు, పుచ్చకాయలు, నారింజలను ఆహారంలో భాగం చేసుకోండి.

ఇవన్నీ పాటిస్తే వర్షాకాలం వచ్చే సమస్యల నుండి కాపాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version