Pooja Hegde : గులాబీ రంగు సూట్ లో గుబాళిస్తున్న బుట్టబొమ్మ

-

బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పూజ పింక్ కలర్ సూట్ లో కనిపించింది. ఈ సూట్ లో పూజ గులాబీ పువ్వులాగా చాలా అందంగా కనిపిస్తోంది.

ఈ ఔట్ ఫిట్ లో పూజ పోజులు కూడా పరిమళిస్తున్న పూవులాగే ఉన్నాయి. పింక్ సూట్ లో ఈ క్యూటీ సూపర్ కూల్ గా ఉంది. క్యూట్ క్యూట్ పోజులిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం పూజ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఔట్ ఫిట్ లో పూజను చూసి ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.

ఇక పూజ ప్రస్తుతం టాలీవుడ్ లో మహేశ్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ భామ తన ఫోకస్ అంతా బాలీవుడ్ పైనే పెట్టింది ప్రస్తుతం. గత కొంతకాలంగా పూజ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో ప్రేమలో ఉన్నట్లు పుకార్లు వస్తున్నాయి. అయితే అవన్నీ వదంతులేనని ఈ బుట్టబొమ్మ కొట్టిపారేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version