Anasuya: చీరకట్టులో రంగమ్మత్త ఎంత మురిపిస్తుందో

-

రంగమ్మత్త.. అదేనండి అనసూయ భరద్వాజ్ మరోసారి చీరకట్టులో కనువిందు చేసింది. బూడిద రంగు చీరలో అనసూయ ఎంతో అందంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్.. చెవికి ఝుంకాలతో మెస్మరైజింగ్ పోజులతో సందడి చేస్తోంది. తాజాగా అనసూయ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య అనసూయ ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తోంది. ట్రెండీ డ్రెస్సులో కూడా మురిపించే అనసూయ చీరలో మాత్రం ఇంకా ఎక్కువ అందంగా కనిపిస్తుంది. తన అందంతో కుర్రాళ్లను కూడా మైమరిపిస్తుంది. తాజాగా అనసూయ షేర్ చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

యాంకర్ గా బుల్లితెరపై అడుగుపెట్టి అనతికాలంలోనే వెండితెరపై అవకాశాలు సొంతం చేసుకుంది. ఓవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరోవైపు బిగ్ స్క్రీన్ పై తన సత్తా చాటుతోంది. తాజాగా అనసూయ రంగమార్తాండ సినిమాలో నటించి అలరించింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి చెబుతూ.. ఈ సినిమా గురించి చెబుతూ తాజాగా అనసూయ కంటతడి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news