గాలా విత్ బాలా.. న్యూ లుక్ లో బాలయ్య బాబు అదుర్స్

-

నందమూరి బాలకృష్ణ మరోసారి ఆహా వేదికగా వినూత్నంగా సందడి చేయనున్నారు. ఆహా వేదికగా తెలుగు ఇండియన్​ ఐడల్​-2 ప్రోగ్రామ్​లో బాలయ్య డ్యాన్స్​ పెర్ఫార్మెన్స్​ ఇవ్వనున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను ఆహా టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్​ చేసింది. ఇంతకు ముందెన్నడూ చూడని బాలయ్యను చూడనున్నారంటూ ట్వీట్​ చేసింది. గాలా విత్​ బాలా అనే హ్యాష్​ ట్యాగ్​ను యాడ్​ చేసింది.

ఈ నెల 17,18న కార్యక్రమం టెలికాస్ట్​ కానుందని ఆహా టీమ్ తెలిపింది. ఈ ఫొటోల్లో బాలయ్య లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బాలయ్య బాబు లుక్ అదుర్స్​ అంటూ ​ కామెంట్లు పెడుతున్నారు. బ్లాక్ కలర్ డ్రెస్సులో బాలయ్య చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. యంగ్ హీరోలకు పోటీగా డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.

ఆహా టీమ్ సూపర్ సింగింగ్ కాంపిటేషన్ తెలుగు ఇండియన్ ఐడల్‌తో ఎంతో మంది గాయనీగాయకులను పరిచయం చేసింది. మొదటి సీజన్‌లో శ్రీ రామ్ చంద్ర హోస్ట్‌గా వ్యవహరించగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జ్​లుగా వ్యవహరించారు. త్వరలోనే తెలుగు ఇండియన్ ఐడల్​ 2 ప్రారంభం కానుంది. ఈ సీజన్ 2 కోసం ఎంపిక అయిన సింగర్స్​ను పరిచయం చేస్తూ ఓ స్పెషల్ ఎపిసోడ్​ను ప్లాన్ చేసింది ఆహా.

Read more RELATED
Recommended to you

Exit mobile version