Pragya Jaiswal : పింక్ ఔట్​ఫిట్​లో అఖండ బ్యూటీ పరువాల విందు

-

ప్రగ్యా జైస్వాల్.. ఈ అఖండ బ్యూటీ సోషల్ మీడియాలో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొన్నటిదాకా బోల్డ్ ఔట్​ఫిట్స్​తో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టిన ప్రగ్య.. ఈసారి ట్రెడిషనల్ ఔట్​ఫిట్​లో సందడి చేసింది. పింక్ కలర్ లెహంగాలో ముంబయిలో ఓ ఇఫ్తార్ పార్టీకి హాజరైంది. ఈ ఔట్​ఫిట్​లో ప్రగ్యా చాలా అందంగా కనిపిస్తోంది.

ప్రగ్యా జైస్వాల్ కంచె సినిమాతో టాలీవుడ్​లో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ప్రగ్య చాలా అందంగా కనిపించింది. ఈ మూవీ తర్వాత ప్రగ్యాకు తెలుగులో అడపాదడపా అవకాశాలు వచ్చాయి కానీ అంతగా సక్సెస్ రాలేదు. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రగ్యా అఖండ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది.

బాలకృష్ణకు జోడీగా ఈ సినిమాలో నటించింది ప్రగ్యా. కలెక్టర్​గా నటించి తన అభినయంతో ప్రేక్షకులను అలరించింది. అఖండ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ మారుతుందని భావించినా.. నిరాశే ఎదురైంది. అంతటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కూడా ఈ భామకు అవకాశాలు రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news