సింహాచలంలో చందనోత్సవం ని జరిపే విధానం ఇదే..!

-

ప్రతీ సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ నాడు సింహాచల నారసింహ స్వామివారికి చందనోత్సవం చేస్తారు. అయితే చాలా మంది దీని గురించి విని వుంటారు కానీ అసలు ఏం చేస్తారు..? ఎందుకు చేస్తారు అనేది తెలీదు. మరి దాని వెనుక వున్నా ముఖ్య విషయాలని తెలుసుకుందాం. తమిళనాడు లోని మారుమూల ప్రదేశం నుంచి స్వామి వారికి చందనపు పూతను పూసేందుకు కావాల్సిన గంధపు చెక్కలని తీసుకొస్తారు. ఆ గంధం జాజిపోకల అనే మేలు రకం. అక్షయ త్రితీయ కి కొన్ని రోజుల ముందే ప్రత్యేకమైన పూజలని నిర్వహించి గంధపు చెక్కల నుండి గంధాన్ని తీసే ప్రక్రియను మొదలు పెడతారు.

తెల్లవారితే అక్షయ తృతీయ అనగా ముందు రోజు అర్థరాత్రి బంగారు బొరుగులతో స్వామివారి మీద వుండే చందనం ని తీస్తారు. ఆ చందనాన్ని పూర్తిగా తీసాక అక్షయ తృతీయ తెల్లవారుజాము నుంచి స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులే మొదట స్వామివారిని దర్శనం చేసుకుంటారు. అక్షయతృతీయ రాత్రి వరకూ భక్తులు దర్శనం చేసుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారి కి అభిషేకం మొదలవుతుంది.

అభిషేకం గురించి చూస్తే.. సింహాచలం కొండ మీదున్న గంగధార నుంచి వెయ్యి కలశాలతో ముందు స్వామి వారికి సహస్ర ఘటాభిషేకాన్ని చేస్తారు. ఆ తరవాత 108 వెండి కలశాలతో స్వామివారికి పంచామృత అభిషేకం. నిత్యా రూపం ని పొందేందుకు 120 కిలోల చందనాన్ని నరసింహ స్వామి వారికి లేపనంగా పూస్తారు. సంవత్సరానికి నాలుగుసార్లు చందనం పూస్తారు. మొత్తం 12 మణుగుల చందనాన్ని ఈ విధంగా లేపనంగా పూస్తారు. దాదాపు 500 కిలోల చందనం ని అక్షయ తృతీయ నాడు భక్తులకి ఇస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news