రెడ్‌ మీట్‌ ఎక్కువగా తింటున్నారా..? వామ్మో మీరు రెడ్‌ జోన్‌లో ఉన్నట్లే..!!

-

మనలో చాలామందికి నాన్‌వెజ్‌ అంటే బాగా ఇష్టం.. వారానికి మూడు రోజులైనా లాగించేస్తారు.. నాన్‌వెజ్‌లో ప్రోటీన్లు ఉంటాయి..తినడం ఆరోగ్యానికి మంచిదే..కానీ మరీ అతిగా తినొద్దు.. మాంసాహారంలో రెడ్‌ మీట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఎక్కువగా తింటే జరిగే మంచి కన్నా..చెడే ఎక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.. మీలో ఎవరికైనా రెడ్‌ మీట్‌ తినే అలవాటు విపరీతంగా ఉంటే ఒకసారి ఈ ఆర్టికల్‌ చదివేయండి.. దానివల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటో తెలుస్తాయి..

 

సాధారణంగా మాంసాహారం ఎముకల ఆరోగ్యానికి సహకరిస్తుంది. ఎముకల పనితీరు సక్రమంగా ఉండాలంటే రెడ్ మీట్ తినాలి. అయితే మటన్ ఎక్కువగా తింటే బోన్స్‌పై సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో చెడు కొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఈ చెడు కొవ్వు రక్తంలో కొవ్వు శాతాన్ని పెంచుతుంది. ఫలితంగా అది గుండె నాళాలను దెబ్బతీస్తుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె నాళాలు దెబ్బతింటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఎముకల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. యానిమల్ మీట్ ఎక్కువగా తినే వారి రక్తంలో ఆమ్లత్వం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని రకాల పోషకాలను శరీరం గ్రహించుకోలేకపోతుంది.. అలాగే ఎసిడిక్ బ్లడ్ కారణంగా ఎముకలపై ప్రభావం పడి, అవి బలహీనంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే రక్తంలో ఆమ్లత్వం పెరిగితే, ఇది ఎముకల నుంచి కాల్షియం తొలగిపోయేందుకు దారితీస్తుంది.

ఎముకలు ధృడంగా ఉండాలంటే కాల్షియం తప్పనిసరి. జంతువుల నుంచి లభించే హై ప్రోటీన్ కారణంగా ఎముకలు కాల్షియంను కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో మాసం వినియోగం పెరిగితే, ఎముకల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా వివిధ రూపాల్లోని ప్రొటీన్‌ని తీసుకోవచ్చు.. పాల వంటి డెయిరీ పదార్థాలు, చేపలు, చికెన్, ప్రొటీన్ ఉండే మొక్కలను డైట్‌లో చేర్చుకోవాలి. వీటితో పాటు పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలతో బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. ఎంతైనా…ప్రకృతి పరంగా ప్లాంట్‌ బేసెడ్‌ ఆహారాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎల్లవేళలా మంచిది. దీనివల్ల మనకు కావాల్సిన పోషకాలు అందుతాయి ఆరోగ్యంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news