రంగులు కలిపిన ఆహారంతో క్యాన్సర్‌ ముప్పు.. లిస్ట్‌లో ఫస్ట్‌ వెనిల్లా ఐస్ క్రీమ్, పాప్ కార్న్..!

-

రంగు రంగుల చిరుతిళ్లు చూస్తే చిన్నపిల్లలు బాగా యట్రాక్ట్‌ అవుతారు. కొనిచ్చే వరకూ వదిలిపెట్టరు. కావాలంటే గమనించండి.. పిల్లలు ఎప్పుడు కలర్‌ కలర్‌గా కనిపించేవే ఎక్కువగా అడుగుతారు. మనం కూడా వాళ్లు అడిగారు కదా అని అవే ఇప్పిస్తాం.. కానీ అవి ఆరోగ్యాన్ని ఎంత పాడు చేస్తాయో తెలుసా..? బయట తినే చాలా ఆహారాలు కృత్రిమ రంగులు, రుచులను కలిగి ఉంటాయి. ఈ రంగుల ఆహారాన్ని తినడం వల్ల కొందరిలో ఫుడ్ కలర్స్ అలెర్జీకి కారణం అవుతాయని వైద్య నిపుణులు అంటున్నారు.. శరీరంలో ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఒక్కోసారి రోగనిరోధక వ్యవస్థ సొంత శరీరంపైనే ప్రతి చర్యను చూపిస్తుంది. ఇది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది.

క్లీవ్ ల్యాండ్ క్లినిక్ చేసిన అధ్యయనాల ప్రకారం కృత్రిమ ఆహార రంగుల వాడకం వల్ల పిల్లల్లో చాలా తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేలింది.. ముఖ్యంగా ఏం వస్తాయంటే..

శరీరంపై దద్దుర్లు రావచ్చు.
ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది.
పిల్లల్లొ హైపర్ యాక్టివిటీతో పాటూ, ఆటిజం రావచ్చు.
క్యాన్సర్ కణితులు శరీరంలో పెరిగే అవకాశం ఉంది.
చిరాకు, డిప్రెసన్, మానసిక ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి.

ఏ ఆహారాల్లో ఫుడ్‌ కలర్‌ ఎక్కువగా ఉంటుంది..

వెనిల్లా ఐస్ క్రీమ్
బాల్సమిక్ వెనిగర్
తెల్ల రొట్టె
పాప్ కార్న్
బయట అమ్మే ఊరగాయలు
సలాడ్ డ్రెస్సింగ్
చూయింగ్ గమ్
బయట అమ్మే పెరుగు (తెలుపు రంగు)
ఎనర్జీ బార్ చాక్లెట్లు
ఓట్స్ వంటకాలు
చిప్స్
చాక్లెట్లు
క్యాండీలు
రంగుల స్వీట్లు
కూల్ డ్రింకులు

ఇవి కొన్ని మాత్రమే ఇంకా చాలా రకాల ఆహారాల్లో ఫుడ్ కలర్‌ ఉంటుంది. ఈరోజుల్లో బయట తినే ఏదీ కలుషిత కాకుండా లేదు. అన్నీ కల్తీవే.. స్లోపాయిజన్‌తో సమానం. ఆఖరికి తాగే నీరు కూడా.!

ఫుడ్ కలర్‌ ఉన్నవి తిన్నాక.. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు వాటిని మానేయాలి.. అవి మీ శరీరానికి పడలేదని అర్థం..

తలనొప్పి
శరీరంపై దద్దుర్లు
చర్మంపై దురద
చర్మం ఎరుపు
శ్వాస ఆడకపోవడం
ఛాతీ బిగుతుగా మారడం
మైకం, వికారం రావడం
రక్తపోటు తగ్గడం
శరీరం నుంచి వేడి ఆవిర్లు వచ్చినట్టు అనిపించడం
ముఖం, పెదవులు, నుదురు ప్రాంతాల్లో వాపు రావడం

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల్లోనే రంగులు కలుపుతారు. కాబట్టి వాటిని తినడం మానేయడం ఉత్తమం. కానీ ఈరోజుల్లో పెద్దలకే బయట ఫుడ్స్‌ మీద కంట్రోల్‌ లేదు. ఇక పిల్లలు మాత్రం ఏం చేస్తారు.. ఆరోగ్యంపై శ్రద్ధ అందరికీ ఉండాలి.. అలాంటివి ఎప్పుడో ఒకసారి అయితే పర్వాలేదు.. కానీ రోజూ బయట ఆహారాలే తింటే..జీతం అంతా ఆసుపత్రి బిల్లులకే పోతుంది..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version