మన శరీరం అనేక రకాల అనారోగ్యాలని పసిగడుతుంది. కానీ మనం ఆ లక్షణాలను కూడా పట్టించుకోకుండా ఉంటాం. అయితే ఒకవేళ ఆ లక్షణాలని మనం అర్థం చేసుకుంటే ముందుగానే అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. డాక్టర్లు కూడా అనారోగ్యాల వల్ల కలిగే లక్షణాలు గురించి కనుగొన్నారు. మరి ఇప్పుడే వాటి కోసం తెలుసుకోండి.
యూరిన్:
మూత్ర విసర్జన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించారా…? సాధారణంగా ఆరోగ్యంగా ఉండే వాళ్లలో ఎటువంటి వాసన ఎక్కువగా రాదు. పైగా అది లైట్ పసుపు రంగు లో ఉంటుంది. అలానే ఉన్నట్టయితే మీకు ఎటువంటి సమస్య లేనట్టే.
గోళ్ళు:
పేదల లాగే మనం ఆరోగ్యంగా ఉన్నామో లేదో గోళ్ళు కూడా సూచిస్తాయి. విచిత్రమైన గీతలు లేదా గోళ్ల పై, కాళ్ళ గోళ్ళ పై రంగు లేకపోవడం ఉంటే కాస్త సమస్య ఉన్నట్టే. ఎప్పుడూ కూడా గోళ్లపై ఎరుపు రంగు ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా అనారోగ్యాల బారిన పడితే గోళ్ల రంగు కూడా మనకి అనారోగ్యం ఉన్నట్టు చూపిస్తాయి.
ఎత్తు:
ఎప్పుడైనా మనిషి ఎత్తు ఎదుగుతూ ఉంటాడు. కానీ ఎత్తు తగ్గిపోవడం అన్నది ఎప్పుడైనా విన్నారా…? చాలా మందికి ఈ విషయం తెలియదు. కానీ రియాలిటీ ప్రకారం చూస్తే ఎత్తు కూడా తగ్గిపోతూ ఉంటారు. అది బోన్స్ వల్ల కలిగే సమస్య. చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సంగతి తెలుసు. ప్రోటీన్ కాల్షియం లాంటి న్యూట్రియంట్స్ తగ్గిపోయినప్పుడు ఇలా జరుగుతుంది.
ఒంట్లో కొవ్వు శాతం:
ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి సమతుల్యమైన ఫ్యాట్ పర్సెంట్ ఉంటుంది. ఎక్కువగా కొవ్వు ఉంది అంటే వీక్ మజిల్స్ కారణంగా అది జరుగుతుంది. రన్నింగ్ చేయకపోవడం, వాకింగ్ చేయకపోవడం లేదా ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ చేయకపోతే ఈ సమస్య వస్తుంది.
బ్యాడ్ బ్రీత్ :
దవడలు వాపు వచ్చినప్పుడు దుర్వాసన కలిగిస్తుంది. చెడు శ్వాస మీ రోగ నిరోధక వ్యవస్థకు కూడా సంబంధం కలిగి ఉంది. చెడు శ్వాస లేదు అంటే మీకు రోగనిరోధక శక్తి బాగానే ఉన్నట్టు.
కాళ్లల్లో వాపులు:
కాళ్లల్లో వాపులు కేవలం ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా ఉంటే మాత్రమే రావు. మీ కాళ్లలో వాపులు కనక ఉంటే అది థైరాయిడ్ లేదా గుండెజబ్బులకు సంకేతం.
పెదవులు పొడిబారడం:
పెదవులు పొడిబారిపోతే చాలా మంది లిప్ బామ్ రాసుకుంటూ ఉంటారు. అయితే ప్రతి సారి పెదాలు పొడిబారి పోతున్నాయి అనేది పెద్ద సమస్య. డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం విటమిన్స్ లోపం ఉంటే పెదాలు పొడిబారిపోతూ ఉంటాయి.
నిద్ర:
మీరు సరిగ్గా నిద్ర పోలేక పోతున్నారా..? అయితే చాలా కారణాలు ఉంటాయి. కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం లేదా ఎనర్జీ ఎక్కువ వృధా చేయడం మరియు చెడు ఆహార పదార్థాలు తీసుకోవడం నిద్రపోలేక పోవడానికి కారణాలు.
శరీర ఉష్ణోగ్రత:
అవయవాలు చల్లగా ఉండడం సాధారణం కాదు. తరచు మీకు ఇలా ఏర్పడితే ఇది పెద్ద సమస్య అని గుర్తించాలి. చేతులు చల్లబడటం, పాదాలు చల్లబడటం, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ని సూచిస్తాయి. ఎప్పుడైతే మీకు సరిగ్గా రక్తం వెళ్లడం లేదు అంటే అప్పుడు ఈ సమస్యలు వస్తాయి.
చెడు చర్మం:
చర్మాన్ని బట్టే కూడా మనం ఆరోగ్యాన్ని అంచనా వేయొచ్చు. చాలా మందికి యాక్నీ ఉంటుంది. అప్సెట్ గా ఉండడం దీనికి కారణం. సరైన డైట్ తీసుకోకపోవడం కూడా చర్మం యొక్క నాణ్యత ను తగ్గిస్తుంది. ఎప్పుడైనా వింత మచ్చలు కనుక ఉన్నాయి అంటే తప్పకుండా ఏదో అనారోగ్య సమస్య అని గుర్తించండి.