నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో సగటు నగర జీవి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఇల్లు, ఆఫీసు, ఆర్థిక వ్యవహారాలు, ఇతర సమస్యల కారణంగా ఒత్తిడి ప్రతి ఒక్కరినీ భూతంలా పట్టి పీడిస్తోంది. దీంతో అది వారి శృంగార జీవితంపై ప్రభావం చూపుతోంది. అయితే స్త్రీ, పురుషుల్లో శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడానికి ఒత్తిడే కాదు, ఇంకా పలు ఇతర కారణాలు కూడా ఉంటాయి. కానీ ఈ సమస్య నుంచి చాలా తేలిగ్గానే బయట పడవచ్చు. అందుకు గాను కింద సూచించిన ఆహారాలను నిత్యం తీసుకుంటే చాలు.. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి ఆ ఆహారాలు ఏమిటంటే…
1. బీట్రూట్
బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. వీటిల్లో ఉండే నైట్రేట్లు రక్త సరఫరాను పెంచుతాయి. అందువల్ల పురుషులకు ఉండే అంగస్తంభన సమస్య పోతుంది. ఫలితంగా శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. నిత్యం బీట్రూట్ను జ్యూస్ రూపంలో తీసుకున్నా లేదా భోజనానికి ముందు బీట్రూట్ ముక్కలను తిన్నా ఫలితం ఉంటుంది.
2. పాలకూర
పాలకూరలో ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వీర్యంలో శుక్ర కణాల కదలికను మెరుగు పరుస్తాయి. దీంతో సంతానం కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పాలకూరను నిత్యం తీసుకుంటే వీర్యం వృద్ధి చెందుతుంది.
3. ఉల్లిపాయలు
ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వీర్యాన్ని పెంచుతాయి. శృంగారంలో ఎక్కువ సేపు పాల్గొనే శక్తిని పెంచుతాయి. అలాగే జననావయవాలకు రక్త సరఫరాను మెరుగు పరుస్తాయి. దీంతో అంగ స్తంభన పోతుంది. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొంటారు. నిత్యం పచ్చి ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
4. టమాటాలు
వీటిల్లో ఉండే లైకోపీన్ శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. అంగ స్తంభన సమస్యలను పోగొడుతుంది. నిత్యం టమాటాలను పచ్చిగా తిన్నా, జ్యూస్‌లా తాగినా ఫలితం ఉంటుంది.
5. మునగకాయలు
మునగకాయల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. నిత్యం మునగకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శృంగార సమస్యలను పోగొట్టుకోవచ్చు.