FLASH : బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్న ప్రభాస్..! అదేంటో తెలుసా..?

-

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ గురించి ఇప్పుడొక వార్త హాల్ చల్ చేస్తుంది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరిదశకు చేరుకున్న వెంటనే నాగ్ అశ్విన్ తో మరొక చిత్రం ప్రకటించేశాడు. అయితే ఇప్పుడు తాజాగా.. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చేందుకు ప్రభాస్ సిద్దమైనట్టు తెలుస్తుంది. ప్రభాస్ మంగళవారం తన తదుపరి ప్రాజెక్ట్‌ పై సంచలన ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రభాస్ ఈసారి ఏకంగా బాలీవుడ్‌ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్టు సమాచారం.

ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ దర్శకుడిగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి భూషన్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించే అవకాశం ఉంది. ఈ సినిమా టీ సీరిస్ బ్యానర్‌పై తెరకెక్కే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. వీడియోలో ఓవైపున ప్రభాస్ ఉండగా, మరోవైపున ప్రముఖ నిర్మాణ సంస్థ, ఆడియో కంపెనీ టీ సిరీస్ ప్రతినిధి ఉండడం చూడొచ్చు.

టీ సిరీస్ ప్రతినిధి మాట్లాడుతూ, “హాయ్ ప్రభాస్, రేపటికి మీరు రెడీగా ఉన్నారా?” అని ప్రశ్నించగా, “చాలా ఎక్సైటింగ్ గా ఉంది, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను” అంటూ ప్రభాస్ బదులిచ్చాడు. “లెట్స్ డూ ఇట్” అంటూ టీ సిరీస్ ప్రతినిధి ఉత్సాహంగా పిడికిలి బిగించాడు. ఈ విషయాన్ని రేపు ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ప్రభాస్ లైవ్ ఓమ్ రౌత్ తో కలిసి ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news