ఇటీవల కాలంలో చాలా మంది గొంతునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. మరియు ముఖ్యంగా జలుబు, జ్వరం వచ్చేటప్పుడు గొంతు నొప్పి కూడా ముందు మొదలవుతుంది. ఇక గొంతు నొప్పి ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడలేని పరిస్థితి.. ఏదైనా తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఇలా గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందాలి అంటే రోజు వారి డైట్ లో కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇక ఎండాకాలం అయిపోయిందంటే శరీరంలో వివిధ రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు సమస్యలకు తోడు గొంతులో గరగర , అలర్జీలు వంటివి సమస్యాత్మకంగా మారుతుంటాయి. ఇక అలర్జీతో బాధపడేవారు కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది.
ఇక గొంతు నొప్పి ని తగ్గించే ఆహారాలలో అల్లం టీ కూడా ఒకటి. ఈ సమస్యలతో మీరు బాధపడుతుంటే ప్రతిరోజు అల్లం తో తయారు చేసిన టీ తాగడం వల్ల కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా అల్లం టీలో తేనె కలుపుకొని తీసుకుంటే సమస్య మరింత తక్కువ అవుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తేనె అనేది ఎన్నో రకాల అలర్జీలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి అల్లం టీ లో తేనె కలుపుకొని తాగడం వల్ల మీ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
విటమిన్ సి తో కూడిన పండ్లను కూడా తినడం వల్ల గొంతులో ఏర్పడే గరగరా, ఎలర్జీ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే యాంటీ హిస్టమిన్ గొంతు నొప్పికి కారణమయ్యే క్రిములను నాశనం చేస్తుంది. అందుకే గొంతు నొప్పి వచ్చినప్పుడు నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆరెంజ్, బత్తాయి కివి పండ్లు కూడా మీకు గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఇక అలాగే ఉప్పునీటిని పుక్కరించడం వల్ల గొంతులో ఏర్పడే అలర్జీలు సైతం దూరం అవుతాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ గొంతు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.