ఆల్కాహాల్‌ అలర్జీ ఉంటే.. గుండెజబ్బులు, బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఎక్కువే..

-

కొంతమందికి మందు అంటే ప్రాణం.. మందు మనల్ని ఎంజాయ్‌ చేసేలా తాగుతారు.. ఇంకొంతమంది ఉంటారు.. మనం మందుని ఎంజాయ్‌ చేసాలా తాగుతారు.. రెండింటికి చాలా తేడా ఉందిలే.. ఇంకో బ్యాచ్‌ ఉంటుంది. పాపం వీళ్లకు మందు అంటేనే అలర్జీ. ఆ వాసన పీల్చినా ఆగం ఆగం అయిపోతారు. కొంచె ఆల్కహాల్ తాగినా.. వికారంగా, అసౌకర్యంగా ఫీల్‌ అవుతారు.. ఇలా అయిందంటే.. మీకు ఆల్కహాల్ అలెర్జీ ఉందని అర్థం. అయినా కూడా ఆపకుండా ఆల్కహాల్ తాగితే.. ఆగకుండా సమస్యలు వచ్చేస్తాయి.. అది ప్రాణాంతక సమస్యలకు కారణం అవుతుంది. ఇలా మద్యం తాగాక వికారంగా, అసౌకర్యంగా అనిపించే వారిలో గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం నాలుగు రెట్లు ఎక్కువ అని పరిశోధకులు అంటున్నారు.

ప్రతి 12 మంది పెద్దలలో ఒకరికి ఇలా ఆల్కహాల్ అలెర్జీ ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి..కానీ ఆ విషయాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. మందు తాగితే వాంతులు, వికారం ఉండటం కామన్‌ అనుకుంటున్నారు. దీనివల్ల ఆల్కహాల్ అలవాటును కొనసాగిస్తూ అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. స్థిరంగా మద్యపానం అలవాటును కొనసాగించే వారిలో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా అధికమే.

ఆల్కహాల్ ఎలర్జీ లక్షణాలు

  • వికారంగా అనిపించడం
  • వాంతులు అవ్వడం
  • తలనొప్పి అధికంగా రావడం
  • గుండె కొట్టుకునే వేగం పెరగడం
  • ఆస్తమా ఎక్కువ కావడం
  • రక్తపోటు పడిపోవడం
  • మూర్చ రావడం
  • ఒంటిపై దద్దుర్లు రావడం
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం

మందు తాగాక మీకు ఇలా ఉంటే ఆల్కహాల్ అలెర్జీ ఉన్నట్లే.. మద్యం తాగాక వ్యక్తి కళ్లు, శరీరం ఎర్రగా మారితే అతనికి ఆల్కహాల్ అలెర్జీ ఎక్కువగా ఉందని అర్థం. ఇలా ఎర్రగా మారడానికి కారణం రోగనిరోధక వ్యవస్థలో హిస్టామిన్లు విడుదలవ్వడం. అప్పుడు రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని కారణంగా మనిషి ఇలా ఎర్రగా మారిపోతాడు. ఆల్కహాల్ అలెర్జీ మీకు ఉందనిపిస్తే దాన్ని మానేయడం చాలా అవసరం.. మద్యం తాగడం కొందరికి అలవాటు అయితే.. మరికొందరికి అవసరం అయిపోతుంది. ఇంకొందరికి మాత్రమే టైమ్‌పాస్‌ అవుతుంది. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నారో ఒకసారి గమనించుకోండి.. ఎప్పుడో ఒకసారి అయితే ఎలాంటి సమస్యా ఉండదు. అతి అయితేనే అనవసరమైన సమస్యలు..!

Read more RELATED
Recommended to you

Latest news